జబర్దస్త్ కామెడీ షో పదేళ్లు తెలుగు ఆడియెన్స్ కి వినోదాన్ని పంచుకుంది. దీనికి ఇతర రాష్ట్రాల వారు కూడా ఫ్యాన్స్ అవడం విశేషం. దీంతో అన్ని ఎంటర్‌టైన్‌మెంట్స్ షోల కంటే ఈ షో ఎక్కువగా టీఆర్‌పీతో రన్ అవుతుంది. ఇంటిళ్లిపాదిని అలరిస్తుంది. ఒకప్పుడు వల్గర్ షో అనే కామెంట్ల నుంచి ఇప్పుడు ఇదే వినోదానికి మెయిన్ షోగా నిలవడం విశేషం.
ప్రస్తుతం ఈ షోలో జబర్దస్త్ కి ఇంద్రజ, కృష్ణభగవాన్ జడ్జ్ లుగా వ్యవహరిస్తుండగా, సౌమ్యరావు యాంకర్‌గా ఉన్నారు. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో లేడీ కమెడియన్ తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. చంటి, యాదమ్మ, నూకరాజుల స్క్రిప్ట్ లు ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగాయి. అనంతరం వెంకీ, తాగుబోతు రమేష్‌ల స్కిట్ వచ్చింది. ఇందులో కృష్ణభగవాన్ కూడా నాన్నగా యాక్ట్ చేయడం విశేషం.
వెంకీ, రమేష్.. నేను మంచోడినా, నేను మంచోడినా అంటూ ఇద్దరూ తమ నాన్న(కృష్ణభగవాన్)ని ప్రశ్నిస్తారు. దానికి ఆయన రియాక్ట్ అవుతూ, నేనే మంచోడిని అని, మీ ఇద్దరు ఎలాంటి వారో తెలిసి స్కిట్ చేసేందుకు ఒప్పుకున్నందుకు అని చెప్పడంలో నవ్వులు విరిసాయి. అనంతరం మీ బాధ చూడలేక ఓ పనిమనిషిని మాట్లాడా అని వెంకీ చెప్పడంతో ఏదేది రమ్మను అంటూ కృష్ణభగవాన్ రియాక్ట్ అయ్యారు. ఇంతలోనే అమ్మాయి వచ్చింది. ఆమెతో కాసేపు డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో నవ్వులు పూయించారు కృష్ణభగవాన్. దీనికి ఇంద్రజతోపాటు యాంకర్ సౌమ్యరావు పగలబడి నవ్వడం హైలైట్‌గా నిలిచింది.
స్కిట్ అయ్యాక అసలు రచ్చ మొదలైంది. మాకు ఎందుకు ఇవ్వలేదో(పది మార్కులు) తెలుసుకోవచ్చా అని వెంకీ .. జడ్జ్ ఇంద్రజని ప్రశ్నించారు. ఇచ్చినప్పుడు ఎప్పుడూ అడగలేదే అని ఆమె ఎదురుప్రశ్నించగా, బాగా చేశామ్ కాబట్టి ఇచ్చారని, ఇప్పుడు దానికంటే కొంచెం తక్కువగా చేశారు కాబట్టి ఇవ్వలేదంటూ ఆమె ఘాటుగా సమాధానం చెప్పింది. మేం వంద శాతం బాగానే చేశామని అనుకుంటున్నామని వెంకీ చెప్పగా, అది కృష్ణభగవాన్‌ని కూడా అడగండి, ఆయన కూడా 9 మార్కులే ఇచ్చారుగా అంటూ ఇంద్రజ రిప్లై ఇచ్చింది.
అంతేకాదు నా వద్దే ఇలాంటి ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థం కావడం లేదంటూ ఇంద్రజ ఏకంగా సీట్ నుంచి లేచివెళ్లిపోవడంతో షో మొత్తం హీటెక్కిపోయింది. అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. మరి ఒక్క మార్క్ కోసం వెంకీ.. ఇంద్రజతో వాగ్వాదానికి దిగడం ఇప్పుడు రచ్చ లేపుతుంది. `జబర్దస్త్` వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది. ఇంత వరకు బాగానే ఉంది. కింద నెటిజన్లు, జబర్దస్త్ లవర్స్ కామెంట్స్ మాత్రం షాకిస్తున్నాయి.
ప్రత్యేకంగా ఈ స్కిట్ గురించి, ఇంద్రజ ప్రవర్తన గురించి వాళ్లు ట్రోల్స్ చేస్తున్నారు. సెటైర్లు, విమర్శలతో జబర్దస్త్ జడ్జ్ కి షాకిస్తున్నారు. ఇంద్రజగారు ఇక ఆపండి మీ ఓవరాక్షన్. చూడలేక చచ్చిపోతున్నాం. ఇలాంటివెన్నో చూశాం. ఇంకా అవే చేసి మాకు షోపై, మీ పై ఉన్న అభిప్రాయం పోగొట్టకండి అంటున్నారు.
ఎందుకు బాస్ టీఆర్‌పీ స్టంట్స్, ఇప్పుడు వాటిని ఎవరు నమ్మతారు అంటున్నారు. ఓవర్ యాక్షన్ లో ఇంద్రజగారిని మించిన వాళ్లు లేరంటున్నారు. టీఆర్‌పీ స్టంట్స్ రొటీన్ అయ్యాయని, ఆ డైరెక్షన్ టీమ్‌ని మార్చండి అంటున్నారు. కొందరు అంతకు మించి ఆమెపై కామెంట్లు చేస్తుండటం గమనార్హం. రాను రాను ఈ షో మరీ దిగజారిపోయేలా ఉందని పోస్ట్ లు పెట్టడం విచారకరం. మొత్తంగా ఇది రచ్చలేపుతుందని చెప్పొచ్చు.