Pawan Kalyan
Pawan Kalyan son Mark Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు సింగపూర్‌లో అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. చిన్న చిన్న గాయాలతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, క్రమంగా కోలుకున్నారు. విషయం తెలిసి ఆ వెంటనే పవన్ కళ్యాణ్, చిరంజీవి, సురేఖ సింగపూర్ వెళ్లారు.
దగ్గరుంచి కొడుకుని చూసుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కోలుకున్నాడు. దీంతో సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం పవన్ తన కొడుకు మార్క్ శంకర్, భార్య అన్నా లెజినోవాతో కలిసి హైదరాబాద్ వచ్చారు పవన్.
Pawan Kalyan’s son Mark Shankar
అనంతరం తిరుపతికి చేరుకున్నారు. ఈ రోజు రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. రేపు సోమవారం ఉదయం శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకోనున్నారు.
కొడుకు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడటంతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే పవన్ తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి మరో కారణం ఉంది. తన భార్య అన్నా లెజినోవా శ్రీవారిని మొక్కుకోవడం విశేషం.
సింగపూర్ లో ఘటన జరిగిన నేపథ్యంలో తన కొడుకు ప్రాణాలతో బయటపడాలని, ఎలాంటి అపాయం జరగకూడదని ఆమె తిరుమల శ్రీవారిని మొక్కకుందట. మొక్కు ఫలించింది. కొడుకు చిన్న చిన్న గాయాలతో పెద్ద ప్రమాదం లేకుండా బయటపడ్డాడు.
ఇప్పుడు దాదాపుగా కోలుకున్నాడు. దీంతో శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వెల్లడం విశేషం. అయితే ఇక్కడే ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. పవన్ భార్య అన్నా స్వతహాగా క్రిస్టియన్. కానీ కొడుకు ప్రాణాల కోసం తన మతాన్ని పక్కన పెట్టి తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కుకోవడం విశేషం.