పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మలో కూడా ఈ చిత్రం లీక్ అయింది. యువత ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. కంప్లీట్ అడల్ట్ కామెడీ చిత్రంగా ఈ మూవీ నవ్వులు కురిపిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కూర్చుని అసలు చూడలేరు. ఒంటరిగా మాత్రమే చూడాలి. ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్ రెడ్డి ఈ చిత్రంలో హీరోగా నటించారు. వైభవ్ సోదరుడు సునీల్ రెడ్డి కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. రామనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న విడుదలయింది. తాజాగా ఓటిటిలోకి వచ్చింది.