రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

Published : Jun 20, 2024, 09:56 AM IST

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అప్పు చేశారా..? అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర తీసుకున్నారా..? ఎంత తీసుకున్నారు..? వడ్డి ఎంత కట్టారు..? అసలు పవన్ కు రామ్ చరణ్ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది...?   

PREV
16
రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకోవడంతో.. మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. తాను సాధించిన విజయాన్ని అన్న చిరంజీవికి అకితం చేసి పాదాలపై పడ్డాడు పవన్ కళ్యాణ్. ఈ ఎమోషనల్ మూమెంట్  చూసి మెగా ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. రామ్ చరణ్ తోపాటు.. మెగా ఫ్యామిలీ అంతా.. పవన్ కు వెన్నంటే ఉండి.. విన్నింగ్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా చేశారు. 

రామ్ చరణ్ కు ఉన్న వింత అలవాటు ఏంటో తెలుసా..? మెగాస్టార్ వారసుడు అనిపించుకున్నాడుగా..?

26

ఈక్రమంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి పాదాలకు నమస్కరిస్తే.. రామ్ చరణ్ పవన్ కళ్యాన్ పాదాలకు నమస్కరించాడు. ఈ ఎమోషనల్ మూమెంట్ తో పాటు పవన్ ‌- రామ్ చరణ్ కు సబంధించిన  మరోవిషయం కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దగ్గర అప్పు చేశారట..? వడ్డీ కూడా ఇస్తానని చెప్పి చరణ్ దగ్గర చాలాసార్లు డబ్బులు తీసుకన్నారట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ .. పవన్ కళ్యాణ్ కలిసి చెప్పారు.

త్రిష,నయన్ ను వెనక్కి నెట్టిన రష్మిక మందన్న, రేటు భారీగా పెంచిన శ్రీవల్లి.. ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

36

అయితే రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంది ఇప్పడు కాదు.. ఎప్పుడో కెరీర్ బిగినింగ్ లో.. చరణ్ అసలు అప్పటికి ఇండస్ట్రీలోకి రాలేదు. మెగా ప్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబంగా...ఒకే ఇంట్లో ఉంటున్న టైమ్ లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉండేవారట. అప్పుడు పాకెట్ మనీకోసం చాలా తంటాలు పడేవారట. 
 

బాడీగార్డ్ నన్ను అక్కడ అసభ్యంగా తాకాడు.. చేదు అనుభవాన్ని పంచుకున్న టాలీవుడ్ హీరోయిన్..?

46

చిరంజీవి ఇచ్చిన పాకెట్ మనీ అయిపోగా.. చరణ్  కు చిరు ఇచ్చిన పాకెట్ మనీలోంచి అప్పుడు అడిగేవాడట పవన్. చిన్నవాడు కావడంతో.. ఏదో ఒక కహానీలు చెప్పి.. వడ్డీ వేసి తరువాత ఇస్తానని చెప్పి.. మాయ చేసి.. చరణ్ దగ్గర డబ్బులు వసూలు చేసేవాడట పవన్. గతంలో జరిగిన ఈ స్వీట్ మెమరీస్ ను.. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో పవన్‌- చరణ్ కలిసి వెల్లడించారు.. సరదాగా నవ్వుకున్నారు కూడా. 
 

56

అంతే కాదు.. టైమ్ పాస్ అవ్వాలని చెప్పి.. రామ్ చరణ్ కు.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకు మధ్య చిన్న చిన్న తగవులు కూడా పెట్టేవాడట పవర్ స్టార్. బ్యాచిలర్ గా ఉన్న రోజుల్లో ఇలా అల్లరి చేస్తూ.. మెగాఫ్యామిలీలో సందడి వాతావరణ ఉండేదట. ఇప్పటికీ చిరంజీవి ఇంట ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. విడి విడిగా ఉంటున్నా.. ప్రతీ అకేషన్ ను మెగాస్టార్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు అందరు.
 

66
Pawan Kalyan

ఎన్నో కష్టాలు పడి.. మాటలు.. అవమానాలు ఎదుర్కొన్ని పవర్ స్టార్ రాజకీయంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆంధ్ర ప్రదేశ్ కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. కీలక శాఖలను తీసుకున్న పవన్ రాష్ట్రాన్ని బాగు చేయాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇక సినిమాల సంగతి ఏంటనేది ఆయన  క్లారిటీ ఇవ్వలేదు.

Read more Photos on
click me!

Recommended Stories