Pawan Kalyan Thanks PM: హైదరాబాద్‌కు శంకర్‌.. మోదీ హెల్ప్‌ మర్చిపోలేనని పవన్‌ ఎమోషనల్‌!

Pawan Kalyan Thanks PM: ఆంధప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో అతని కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు అక్కడ వైద్య సేవలు పొందిన తర్వాత.. ఆరోగ్యం మెరుగపడటంతో సింగపూర్‌ నుంచి శనివారం రాత్రి పవన్‌ తన సతీమణి అన్నాలెజినోవా, కుమారుడు మార్క్‌శంకర్‌, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఇక పవన్‌ కుమారుడికి అందిన వైద్యం, ప్రధాని మోదీ చేసిన సాయం గురించి ఎమెషనల్‌ ట్వీట్‌ పవన్‌ చేశారు. ఆయన ఏమన్నారంటే.. 

Pawan Kalyan Thanks PM Modi for Support After Son Fire Accident in Singapore in telugu tbr
Pawan Kalyan’s son Mark Shankar

పవన్‌ కల్యాణ్‌ కుమారుడికి సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఊపిరి తీసుకోవడానికి బాబు ఇబ్బంది పడ్డాడు. అయితే.. అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

Pawan Kalyan Thanks PM Modi for Support After Son Fire Accident in Singapore in telugu tbr
Pawan Kalyan’s son Mark Shankar

ఈ ఘటనపై రెండు రోజుల కిందటే మెగాస్టార్‌ చిరంజీవి స్పందిస్తూ.. ''మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో  త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే  వుంటాడు. రేపు  హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద  ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ  సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా  ప్రాంతాల్లో మార్క్  శంకర్  కోలుకోవాలని ప్రతి  ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.'' అని చిరంజీవి ట్వీట్‌చేశారు. 


Megastar Chiranjeevi Shares Emotional Update on Pawan Kalyan's Son's Health

చిరంజీవి ట్వీట్‌తో మార్క్‌ శంకర్‌కి ప్రమాదం ఏమీ లేదని తెలిసి అభిమానులు హ్యీపీగా ఉన్నారు. ఇక శనివారం రాత్రి పవన్‌ కుటుంబసభ్యులతో హైదరాబాద్‌ చేరుకున్నారు. పవన్‌ తన కుమారుడిని ఎత్తుకుని ఫ్లైట్‌లోని నుంచి బయటకు వస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతోంది. ఆయనతోపాటు భార్య, ఇద్దరు పిల్లలు, కాకినాడ ఎంపీ తంగిళ్ల `ఉదయ్‌ శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు. అనంతరం బాబు ఆరోగ్య పరిస్థితిపై పవన్‌ లేటెస్ట్‌గా ట్వీట్‌ చేశారు. 

pawan kalyan, akira nandan, mark shankar

మార్క్‌ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా పవన్‌ కల్యాణ్‌ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్‌ పెట్టారు. బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు. తన బాబుకి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే మార్క్‌ శంకర్‌ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకున్న అన్ని పార్టీల నాయకులు, జనసేన శ్రేణులు, అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు పవన్‌ థ్యాంక్స్‌ చెప్పారు. క్లిష్ట సమయంలో వారి సందేశాలు, ప్రార్థనలు తమ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చినట్లు పవన్‌ తెలిపారు. 

Pawan Kalyan with his wife anna

ఇక సింగపూర్‌లో మార్క్‌ శంకర్‌ గాయపడిన వెంటనే పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసినట్లు తెలిపారు. దీంతోపాటు అక్కడ బాబుకి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సాయం చేశారంట. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పవన్‌ తెలిపారు. ఆయన ఏమన్నారంటే.. ''ఉత్తరాంధ్ర పర్యటన ఉన్న సమయంలో ఈ వార్త విని బాధపడ్డాను. నా కొడుకు, అక్కడి ఇతర పిల్లల కోసం మీరు సకాలంలో జోక్యం చేసుకోవడం నా కుటుంబానికి అపారమైన బలాన్ని, ఉపశమనాన్ని ఇచ్చిందని ప్రధానిని ఉద్దేశించి పవన్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు గిరిజనుల కోసం రూ.1,005 కోట్లు ఇచ్చి వారి కష్టాలను తీర్చిన వ్యక్తి ప్రధాని మోదీ అని పవన్‌ కొనియాడారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 

Latest Videos

vuukle one pixel image
click me!