SSMB 29
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB 29(వర్కింగ్ టైటిల్). 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్. అటవీ నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రంగా రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
రాజమౌళి సినిమాలో డైలాగులు కథకు అవసరమైన మేరకు ఉంటాయి. భారీ డైలాగులు ఉండవు. రాజమౌళి, మహేష్ మూవీ డైలాగుల విషయంలో ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. రాజమౌళి చిత్రాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుంటారు. డైలాగులు మాత్రం ఇతర రచయితలతో రాజమౌళి రాయించుకుంటారు. రాజమౌళికి కథపై ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఈ కథకు ఎవరు బాగా డైలాగులు రాయగలరు అని రాజమౌళికి అనిపిస్తే వారినే తీసుకుంటారు.
ఆర్ఆర్ఆర్ చిత్ర డైలాగుల కోసం సాయి మాధవ్ బుర్రా వర్క్ చేశారు. మహేష్ బాబు చిత్రం కోసం ఊహించని విధంగా రాజమౌళి ఒక ఫ్లాప్ డైరెక్టర్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. ప్రస్థానం లాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దేవాకట్టా. దేవాకట్టాకి క్రిటికల్లీ అక్లైమ్డ్ డైరెక్టర్ గా గుర్తింపు ఉంది కానీ ఆయన కమర్షియల్ గా ఫెయిల్. దేవాకట్టా తెరకెక్కించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేదు.
Mahesh Babu
అయినప్పటికీ రాజమౌళి దేవాకట్టాపై నమ్మకంతో SSMB 29 చిత్ర డైలాగులు రాసే బాధ్యతని అప్పగించారు.ఆల్రెడీ దేవాకట్టా ఒక వెర్షన్ డైలాగులు పూర్తి చేశారట. దేవాకట్టాకి తెలుగు లిటరేచర్ పై మంచి పట్టు ఉంది. దేవాకట్టా చిత్రాల్లో రాసే సంభాషణలు కూడా హృదయాన్ని తాకే విధంగా ఉంటాయి. ఆ నమ్మకంతోనే జక్కన్న ఇతడికి డైలాగ్స్ బాధ్యత అప్పగించినట్లు టాక్. మరి దేవాకట్టా ఈ గోల్డెన్ ఛాన్స్ ని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.