Vishwambhara
Vishwambhara Story: చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ `విశ్వంభర`. త్రిష హీరోయిన్‌గా `బింబిసార` ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు. `జగదేక వీరుడు అతిలోక సుందరి` తర్వాత ఆ జోనర్‌లో రూపొందుతున్న మూవీ ఇది.
అయితే ఇందులో ఫాంటసీ ఎలిమెంట్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. మరి కథ ఏంటనేది రకరకాలుగా వినిపిస్తుంది. విడుదలైన టీజర్‌లో భూలోకంతోపాటు దేవతలోకంలోని సన్నివేశాలను చూపించారు. ఆంజనేయుడి ఎలిమెంట్లు, శివుడి ఎలిమెంట్లు కూడా ఉంటాయని తెలుస్తుంది.
Vishwambhara film update
ఇదిలా ఉంటే తాజాగా మూవీ స్టోరీని లీక్ చేశారు దర్శకుడు వశిష్ట తండ్రి, నిర్మాత సత్యనారాయణరెడ్డి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ `విశ్వంభర` అప్ డేట్ ఇచ్చారు. సినిమా ఫస్టాఫ్ మొత్తం చిరంజీవి స్టయిల్ లో ఉంటుందట.
`ఘరానా మొగుడు`, `రౌడీ అల్లుడు` స్టయిల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందట. ఆ సమయంలో వింటేజ్ చిరంజీవిని చూడొచ్చు అట. ఇంటర్వెల్ కి ఫాంటసీ ఎలిమెంట్లు వస్తాయట. ఆ తర్వాత నుంచి సినిమా వేరే లోకాల్లోకి వెళ్తుందని, మూడు గంటలు సినిమా ఉంటే గంటన్నరకుపైగా సీజీ ఉంటుందని తెలిపారు.
Vishwambhara
ఏడు లోకాల్లో కథ నడుస్తుందట. ఏడు గెటప్‌లు ఉంటాయట, కొత్త పాత్రలు వస్తాయి. కొత్త ప్రపంచం వస్తుంది. అక్కడే సీజీ వర్క్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అసలు కథ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి స్టార్ట్ అవుతుందని, దీనికి సంబంధించిన ఏనిమిది భారీ సెట్స్ వేశారట. అవి ఏడు లోకాలకు సంబంధించిన సెట్స్ అని వెల్లడించారు.
ఆయా సన్నివేశాలకు సంబంధించిన వర్క్ సీజీ ప్రధానంగా ఉంటుందని చెప్పారు. గతంలో మూడు నాలుగు కంపెనీలకు సీజీ వర్క్ ఇచ్చారు, టీజర్ రిలీజ్ చేసినప్పుడు విమర్శలు వచ్చాయి. దీంతో పకడ్బందీగా సీజీ వచ్చాకనే రిలీజ్ డేట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ నెల చివరి వరకు సీజీ వర్క్ ఫైనల్ ఔట్‌పుట్ వస్తుందన్నారు.
Vishwambhara Teaser
సీజీ విషయంలో టీమ్ సంతృప్తి అయితేనే రిలీజ్ డేటే ఇస్తారని, లేదంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదన్నారు. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందట. స్పెషల్ సాంగ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉందని, అది సీజీ వర్క్ కంప్లీట్ అయ్యాక తీయాలని అనుకుంటున్నారు.
దాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు టీమ్ మొత్తం సీజీ పైనే ఫోకస్ పెట్టారు. ఆ విషయంలో రాజీ పడే ఉద్దేశ్యం లేదన్నారు నిర్మాత సత్యనారాయణ రెడ్డి. సినిమాపై భారీ హైప్‌ని పెంచారు.
Vishwambhara
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం మేరకు సినిమా స్టోరీ ఏంటనేది చూస్తే, ఒక రాక్షసుడు చిన్న పిల్లలను, దేవ కన్యలను ఎత్తుకుపోతుంటాడు. ఈ క్రమంలో ఒక దేవ కన్య భూమి మీదకు వస్తుంది. ఆమెకి చిరంజీవితో పరిచయం అవుతుంది.
ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే ఆ రాక్షసుడు భూమి మీదకు వచ్చి ఆ దేవ కన్యని, అలాగే చిరంజీవికి చెందిన చిన్న పిల్లాడిని ఎత్తుకుని పోతాడట.