Senior NTR-Bhanumathi
Nandamuri Taraka Rama Rao Food Habits: నటన, పాలన, దానం, ఇలా ఏ విషయంలో అయినా అందరికి ఆదర్శంగా నిలిచాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. తెలుగు సినిమా రంగానికి మహారాజుగా, రాజకీయాలల్లో రారాజుగా, పాలనలో తిరుగులేని శక్తిగా అవతరించి ప్రజలచేత దేవుడిగా కొలవబడ్డారు రామారావు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఏ పని చేసినా.. ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇష్టమైన తిండి తింటారు.
ఇంతకీ సీనియరన్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ పిల్లలు, ఆయన దగ్గర పనిచేసిన వారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పిన సమాచారం ప్రకారం. ఎన్టీఆర్ భోజన ప్రియుడు . ఉదయం 4 గంటలకే నిద్ర లేచేవారట. ఎన్టీఆర్ 5.30 వరకూ కసరత్తులు చేసిన స్నానం పూజ అయిపోయి బ్రేక్ ఫాస్ట్ కు రెడీ అయ్యేవారట. ఇక ఒక్కోసారి 5 గంటలకే బ్రేక్ ఫాస్ట్ చేసేవారట. లేదంటే 6 గంటలకు తినేవారట. అరచేతి మందంతో ఉన్న ఇరవై ఇడ్లీలను ఎన్టీఆర్ అవలీలగా తినేసేవారట. ఇడ్లీతో నాటుకోడిని నంజుకోవడం అంటే పెద్దాయనకు ఎంతో ఇష్టమట.
అంతే కాదు ఒక కోడిని తందూరి చేయించి తినేవారట. ఆ కోడిని ఆయన భార్య బసవతారకం చేసిపెట్టేవారట. కాని కొన్ని రోజులు మాత్రం ఈరోజు కోడి వద్దు అని భార్యకు చెప్పేవారట ఎన్టీఆర్. అప్పుడు ఆమె తోటకూరు వెల్లుల్లి కారం తో పాటు మరికొన్ని వెజ్ వెరైటీలు చేసి పెట్టేవారట. అలా ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్ గా ఉండేవని తెలుస్తోంది. యాపిల్ జ్యూస్ అంటే ప్రాణం అంట.. ఆయన ఎక్కువగా ఆపిల్ జ్యూస్ తాగేవారట. మద్రాసులో ఉన్న టైమ్ లో యాపిల్స్ ఎక్కువగా ఎక్కడ బాగుంటాయో కనుక్కుని మరీ.. అక్కడి నుంచి తెప్పించుకునేవారట.
అంతే కాదు షూటింగ్ టైమ్ లో కూడా ఎంత బిజీగా ఉన్నా.. తోటి నటులతో ఫుడ్ గురించి డిస్కర్షన్లు జరిగేవట. రోజుకు 3 నుంచి 5 బాటిల్స్ యాపిల్ జ్యూస్ తాగేవారట ఎన్టీఆర్. సమ్మర్ లో ఈ కోటా పెరిగేదట. ఇక సమ్మర్ వస్తే ఆయన ఫుడ్ లో కాస్త మార్పులు జరిగేవని తెలుస్తోంది. ఎండాకాలంలో రెండు లీటర్ల బాదం పాలు కూడా ఆయన తీసుకునే వారట సాయంత్రం స్నాక్స్ గా బజ్జీలు, అప్పుడప్పుడు డ్రైఫ్రూట్స్ ను కూడా ఎన్టీఆర్ తీసుకునేవారట. ఇక వెజ్ మీల్స్ అయితే గోంగూర, నెయ్యి, రెండు రకాల కూరలు, చారు, అప్పడం, పెరుగు, ఖచ్చితంగా ఉండాల్సిందే.
నాటు కోడి అంటే మహా ప్రీతి ఎన్టీఆర్ కు, వేడి వేడి అన్నంలో నాటు కోడి పులుసును చాలా ఇష్టంగా లాంగించేవారట. కొత్త ప్రాంతానికి వెళ్తే.. పెద్దాయన అక్కడి రుచులను కూడా ఆస్వాదించేవారట. ముఖ్యంగా రాజకీయల్లోకి వచ్చిన తరువాత చైతన్య రథయాత్రలో ఆయన ప్రజలతో మమేకం అయ్యారు. ఎక్కడ టైమ్ దొరికితే.. అక్కడ ఏదుంటే అది తినేవారు. సౌకర్యలు లేని ఆ టైమ్ లో సాధారణ జీవితం గడిపి ఆదర్శంగా నిలిచారు నందమూరి తారక రామారావు.