రీమేక్‌లు చేస్తున్నారని తిడుతున్నారు.. అవి చేయడానికి అసలు కారణం బయటపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

Published : Jul 21, 2025, 11:48 PM IST

పవన్‌ కళ్యాణ్‌ తన కెరీర్‌లో చాలా వరకు రీమేక్‌లు చేశారు. మొన్నటి వరకు అదే ట్రెండ్‌ కొనసాగించారు. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎందుకు రీమేక్‌లు చేయాల్సి వచ్చిందో తెలిపారు. 

PREV
14
రీమేక్‌లతో స్టార్‌ గా ఎదిగిన పవన్‌ కళ్యాణ్‌

పవన్‌ కళ్యాణ్‌ తన కెరీర్‌లో చాలా వరకు రీమేక్‌లు చేశారు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ `ఖుషి` రీమేక్‌. వీటితోపాటు `సుస్వాగతం`, `అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి`, `గోకులంలో సీత`, `గబ్బర్‌ సింగ్‌`, `తీన్‌ మార్‌`, `అన్నవరం`,

 `గోపాల గోపాల`, `కాటమరాయుడు`, `వకీల్ సాబ్‌`, `భీమ్లా నాయక్‌`, `బ్రో` చిత్రాలను రీమేక్‌ చేశారు. స్ట్రెయిట్‌గా చేసిన రెండు మూడు సినిమాలు తప్ప మిగిలినవి పెద్దగా ఆడలేదు. ఈ క్రమంలో రీమేక్‌లనే నమ్ముకున్నారు పవన్‌.

24
రీమేక్‌లపై పవన్‌ కళ్యాణ్‌ కామెంట్‌

దీనిపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రీమేక్‌లు చేస్తున్నారని అంతా తిడుతున్నారు, కానీ అందుకు అసలు కారణం ఆయన బయటపెట్టారు. 

తాను అనుకోకుండా హీరో అయ్యానని, రికార్డులు బ్రేక్‌ చేయాలని, సంచలనాలు క్రియేట్‌ చేయాలని సినిమాలు చేయలేదని తెలిపారు. తన దృష్టి ఎప్పుడూ సమాజంపై, జనాలపై, వారికి మంచి పనులు ఎలా చేయాలనే దానిపై ఉంటుందని చెప్పారు. 

అయితే తన లాంటి హీరోతో సినిమాలు చేసేందుకు పెద్ద దర్శకులు, మంచి దర్శకులు రారు అని, అందుకే రీమేక్‌లు చేయాల్సి వచ్చిందన్నారు పవన్‌.

34
డబ్బుల కోసమే రీమేక్‌లు చేస్తున్నా

దీనికి మరో కారణం చెబుతూ, సొంత కథలతో సినిమాలు చేస్తే ఎప్పుడు రిలీజ్‌ అవుతాయో తెలియదు, వాటిలో చాలా వరకు పోయాయి, అందుకే రీమేక్‌ లు చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు తాను డబ్బుల కోసమే రీమేక్‌ సినిమాలు చేసినట్టు వెల్లడించారు.

 రీమేక్‌లు అయితే త్వరగా సినిమా పూర్తి అవుతుంది. డబ్బులు కూడా వస్తాయనే భరోసాతో ఆయా సినిమాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి మూవీస్‌ చేయడం వల్లే మనీ వస్తుందని, తన భార్యాపిల్లలను పోషించడానికి ఉంటుందని, వేరే దారి లేక రీమేక్‌లు చేశానని వెల్లడించారు పవన్‌. 

ఇలాంటి తరుణంలో నాతో మంచి సినిమా చేయాలని, గొప్ప కథ చెప్పాలని `హరి హర వీరమల్లు` కథతో నిర్మాత ఏఎంరత్నం వచ్చారని, ఇదొక గొప్ప సినిమా అవుతుందని తెలిపారు పవన్‌. సినిమా నచ్చితే రికార్డులు బద్దలు కొట్టాలని చెప్పారు.

44
క్రిష్‌ స్థానంలో జ్యోతికృష్ణ, ఏం చేశాడో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన మూవీ `హరి హర వీరమల్లు`. క్రిష్‌ దర్శకత్వంలో ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. కానీ ఆయన మధ్యలోనే తప్పుకున్నారు. 

ఆ బాధ్యతలను నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ తన భుజాలపై వేసుకుని సినిమాని పూర్తి చేశారు.  ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం జులై 24న విడుదల కానుంది. 

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో `హరి హర వీరమల్లు` మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పవన్‌ కళ్యాణ్‌ రీమేక్‌ల గురించి క్లారిటీ ఇచ్చారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories