పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌... హరి హర వీర మల్లు సాలిడ్ అప్ డేట్..?

First Published | Aug 16, 2024, 2:15 PM IST

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. త్వరలోనే ఎదవ్వబోతోంది పవన్ ఫ్యాన్స్ కు. చాలా కాలంగా పవన్ సినిమా అప్ డేట్ కోసం ఎదరు చూస్తున్న అభిమానులకు దిల్ ఖుష్ అయ్యే వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటంటే..? 

Pawan Kalyan

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌  ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌. ఎలక్షన్ హడావిడి.. డిప్యూటీ సీఎంగా పనివత్తిడిలో బిజీ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్... తన పెండింగ్ సినిమాలను క్రియర్ చేయబోతున్నాడు. షూటింగ్ సగంలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేయడానికి ఆయన టైమ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ మాట చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది కదా.. అని అనుకోవచ్చు. కాని తాజా సమాచారం వింటే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. అదేంటంటే.. పవన్  హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు  మూవీ షూటింగ్  మళ్లీ మొదలయ్యింది. అనుకోని కారణాల వల్ల కొంతకాలంగా ఈ సినిమా ముందుకు కదల్లేదు. అసలు ఈమూవీ ఆగిపోయినట్టే అని చాలామంది కామెంట్లు కూడా చేశారు. 
చిరంజీవి కెరీర్ లో.. షూటింగ్ పూర్తయి రిలీజ్ ఆగిపోయిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

ఇకవారందరికి సమాధానం చెపుతూ.. రీసెంట్ గా వరుస  అప్‌డేట్లతో హడావిడి చేస్తున్నారు హరిహర వీరమల్లు టీమ్... ఈ అప్ డేట్లతో  ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఓ కీలకమైన అప్‌డేట్‌ను అందించారు టీమ్.  హరిహరవీరమల్లు సినిమాకు సబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ను ఆగస్టు 14వ తేదీ నుంచి తిరిగి స్టార్ట్ చేసినట్టు వారు తెలిపారు. హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ తో రూపొందుతున్న ఈసినిమాలో.. యాక్షన్‌ సీన్స్ ను స్టార్ట్ చేశారట. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్.. స్టంట్‌ సిల్వ ఆధ్వర్యంలో ఓ భారీ యుద్ధ సన్నివేశం షూట్ చేసినట్టు తెలుస్తోంది.  ఇందులో 500 మంది ఫైటర్లు, జూనియర్‌ ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. 

ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్..? నందమూరి ఫ్యాన్స్ కు పండగే పండగా..
 


డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పాలపై పట్టు సాధించారు.. అటు ప్రజలు సమ్యలు చూస్తూనే సినిమాలు కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. అందుకు కాను.. వారంలో ఒక రోజు కాని.. రెండు రోజులు కాని సినిమాలకు కేటాయిస్తారని సమాచారం. లేకపోతే నెలలో వరుసగా నాలుగైదు రోజులు సినిమాలకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు మరికొద్ది రోజుల్లో హరి హర వీరమల్లు షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వబోతున్నట్టు కూడా సమాచారం. 

శోభితకు నాగార్జున కండీషన్లు...? చైతును పెళ్ళాడాలంటే అవి తప్పనిసరిగా చేయాల్సిందేనా..?

Hari Hara Veera Mallu

 ఇక ఈసినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మునుపెన్నడు చూడని పాత్రలో కనిపంచబోతున్నారు. ఒక అద్భుతమైన యోధుడిగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అంతే కాదు పవన్ కళ్యాణ్ కు సబంధించిన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. పవన్ తన నట జీవితంలో మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడుగా కనిపించనున్నారు. త్వరలోనే 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌'తో ప్రేక్షకులందరికీ ఒక సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు.

బిగ్ బాస్ లోకి రిషి ‌- వసుధార..? అందుకే గుప్పెడంత మనసు సీరియల్ కు శుభం కార్డ్ వేశారా..? 

గతంలో ఈసినిమాను క్రిష్ డైరెక్ట్ చేయగా.. కొన్ని కారణాల వల్ల ఈసినిమానుంచి రీసెంట్ గా ఆయన తప్పకున్నారు. కాగా యంగ్ డైరెక్టర్  జ్యోతి కృష్ణ ఈ చిత్ర బాధ్యతలను తీసుకున్నారు. ఆయన మూవీనీ తీసుకున్నాక.. రీసెంట్ గా ఓ   టీజర్ కూడా రిలీజ్ చేయగా.. అది  అభిమానులతో పాటు, సినీ ప్రేమికులను అలరించింది.

చిరంజీవి మాట వినకుండా నష్టపోయిన రామ్ చరణ్..? ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది కదా..?

అంతే కాదు హరిహరవీరమల్లు సినిమాపై అంచనాలు పెంచేసింది.  ఇక ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ లో  బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు. 

Latest Videos

click me!