చిరంజీవి కెరీర్ లో.. షూటింగ్ పూర్తయి రిలీజ్ ఆగిపోయిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

First Published | Aug 16, 2024, 1:20 PM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగారు.. కాని ఆయన కెరీర్ లో రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన సినిమా ఒకటి ఉందని మీకు తెలుసా..? ఇంతకీ ఏంటా సినిమా..? 

చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అవుతోంది. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. విలన్ గా.. హీరోగా.. ఎన్నో మలుపులు తిరుగుతూ.. టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఆయన ఎదిగారు. 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి.. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ను అందించారు. గెలుపు తో పాటు.. ఓటములు కూడా సమానంగా చూసిన చిరంజీవి.. టాలీవుడ్ లో మెగా సాంమ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు. 

All So Read: ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్..? నందమూరి ఫ్యాన్స్ కు పండగే పండగా..
 

చిరంజీవితో వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్.. ఆయన్ను ఇన్స్ ప్రెషన్ గా తీసుకుని సొంత ఇమేజ్ ను సాధించడంతో పాటు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పరిశ్రమకు వచ్చిన తారలెందరో..? ఇలా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన చిరంజీవి కెరీర్ లో.. రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన ఏకైక సినిమా గురించి మీకు తెలుసా..? 

All So Read: బిగ్ బాస్ లోకి రిషి ‌- వసుధార..? అందుకే గుప్పెడంత మనసు సీరియల్ కు శుభం కార్డ్ వేశారా..?


అవును చిరంజీవి సినిమా ఒకటి రిలీజ్ అవ్వలేదు. అయితే అదేదో షూటింగ్ దశలోనో.. లేక సగం షూటింగ్ అయిపోయిన తరువాతో ఆగిపోలేదు. షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న తరువాత.. రిలీజ్ దగ్గకు వచ్చేసరికి ఆగిపోయింది సినిమా. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు శాంతి నివాసం. చిరంజీవి - మాధవి హీరో..హీరోయిన్లుగా..తెరకెక్కిన ఈ సినిమాకు  బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది. కాని ఈసినిమా రిలీజ్ మాత్రం ఆగిపోయింది. 

All So Read:శోభితకు నాగార్జున కండీషన్లు...? చైతును పెళ్ళాడాలంటే అవి తప్పనిసరిగా చేయాల్సిందేనా..?

Chiranjeevi

ఈసినిమా ఆగిపోవడానికి కారణ.. నిర్మాత. అవును.. రిలీజ్ కు కొద్దిరోజులు ఉన్నాయి అనగా.. ఈమూవీ ప్రొడ్యూసర్  హఠాత్తుగా మ‌ర‌ణించారు.నిర్మాత మరణంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే అన్ని సర్ధుకున్నాక.. కొంత టైమ్ తీసుకుని శాంతి నివాసం రిలీజ్ చేస్తారులే అని అనుకున్నారు ప్రేక్ష‌కులు. కాని అందరు భావించినట్టుగా..  ఈ మూవీని రిలీజ్ అవ్వలేదు.  సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారో ఏమో.. శాంతి నివాసం రిలీజ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. 

All So Read: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడా..? అందుకే మూడు సార్లు ఛాన్స్ ఇచ్చాడా..?

దాంతో చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయిన రిలీజ్ కు నోచుకోలేని ఏకైక సినిమాగా శాంతి నివాసం నిలిచిపోయింది. ఇక మెగాస్టార్  చిరంజీవి70 ఏళ్ళకు దగ్గరగా ఉన్నా.. అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు. వరుస ప్రాజెక్ట్స్ ను సెట్స్ ఎక్కిస్తున్నారు.  ప్ర‌స్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి  విశ్వంభ‌ర మూవీతో బిజీగా ఉన్నారు చిరు. ఈమూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. 

Latest Videos

click me!