బాలకృష్ణ ఉన్న ఫిగర్‌కి హీరో అవుతాడనుకోలే, ఆయన ఎంజాయ్‌మెంట్‌ బ్యాచ్‌.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

First Published | Aug 16, 2024, 1:39 PM IST

బాలకృష్ణ కాలేజ్‌ డేస్‌లో చూడ్డానికి హీరో ఫిగర్‌ కాదా? ఆయన లుక్‌ ఎలా ఉండేదో చెప్పి షాకిచ్చాడు మాజీ సీఎం. అంతేకాదు అస్సలు హీరో అవుతాడని తాను ఊహించలేదన్నాడు. 
 

Actor Balakrishna

నందమూరి తారకరామారావు నటవారసత్వాన్ని పునికిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చాడు బాలకృష్ణ. తండ్రికి తగ్గ వారసుడిగా రాణిస్తున్నాడు. ఇప్పటికీ టాప్‌ హీరోగా ఉన్నాడు. టాలీవుడ్‌ని ప్రభావితం చేసే స్థాయిలో ఆయన ఉండటం విశేషం. వందకుపైగా సినిమాలు చేసి అదే జోరు, అదే హుషారు, అదే ఎనర్జీతో రాణిస్తున్నారు. సినిమాలే కాదు, రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నాడు. 

ఇదిలా ఉంటే బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి. అంతేకాదు ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాం కాలేజీలో ఇద్దరు కలిసి చదువుకున్నారట. బాలయ్య తనకంటే ఒకటి సీనియర్‌ అని తెలిపాడు. అంతేకాదు తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతుందని, ఫ్రెండ్‌ షిప్‌ ఎప్పటికీ అలానే ఉంటుందని చెప్పాడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి. 
 


Balakrishna

బాలయ్య తనకంటే సీనియర్‌ అయినప్పటికీ తన బ్యాచ్‌లోనే ఉండేవాడట. అంతా ఫ్రెండ్స్ అని రెగ్యూలర్‌గా కలుసుకుంటామని, చెట్టుకింద కూర్చుని చదివే బ్యాచ్‌ తమది అని తెలిపారు. అయితే బాలకృష్ణ సినిమాల్లోకి వస్తాడనిగానీ, హీరో అవుతాడని గానీ అస్సలు ఊహించలేదని చెప్పాడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి. బాలయ్య ఉన్న ఫిగర్‌కి హీరో అవుతాడని తాను అస్సలు ఊహించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కిరణ్‌ కుమార్‌ రెడ్డి. నవ్వుతూ ఈ విషయాన్ని ఆయన పంచుకున్నాడు. పరోక్షంగా సెటైర్లు పేల్చాడు. బాలయ్య ఏంటి? హీరో కావడం ఏంటనేది తన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. 

అదే సమయంలో బాలకృష్ణ సీరియస్ గా ఉండేవాడు కాదట. నటనపట్ల సీనియస్‌నెస్‌ కూడా కనిపించలేదని, చాలా సరదాగా, జోవియల్‌గా, నవ్వుతూ, నవ్విస్తూ కనిపించేవాడట. ఎంజాయ్‌ పర్సన్‌గా ఉండేవాడని, కెరీర్‌ పరంగా సీరియస్‌గా ఉండేవాడు కాదని తెలిపారు. కానీ అప్పటినుంచి తాము మంచి స్నేహితులమని, ఇప్పటికీ కలుస్తుంటామని, అప్పటి రోజులను గుర్తు చేసుకుంటామని, తమ మధ్య ఆ స్నేహం కంటిన్యూ అవుతుందని చెప్పారు కిరణ్‌ కుమార్‌ రెడ్డి. ఓపెన్‌ వీత్‌ ఆర్కే ఇంటర్వ్యూలో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. 
 

కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ తరఫున 2010లో ఉమ్మది ఆంధ్రప్రదేశ్‌కి సీఎం అయిన విషయం తెలిసిందే. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చనిపోయిన అనంతరం రోశయ్య తాత్కాలిక సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత కిరణ్‌ కుమార్‌ని సీఎంని చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. రాష్ట్ర విభజన వరకు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదు.
 

మరోవైపు బాలకృష్ణ అటు సినిమాలు, ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. హిందూపూర్‌ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన `ఎన్బీకే 109` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీంతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు బాలయ్య. 
 

Latest Videos

click me!