పవన్ 'పవర్ స్టార్' బిరుదు వెనుక పోసాని కృష్ణమురళి ప్రమేయం...ఆ బిరుదు పడ్డ మొదటి సినిమా ఏదంటే?

First Published Sep 2, 2021, 9:37 AM IST

పవన్ బిరుదు పవర్ స్టార్ అంటే ఫ్యాన్స్ కి మహా ఇష్టం. పవన్ కంటే పవర్ స్టార్ బిరుదుతో ఆయన ఎక్కువగా పిలవబడుతూ ఉంటారు. మరి ఇంతలా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న ఆ పవర్ స్టార్ బిరుదు వెనుక ఆసక్తికర కథనం ఉంది.

పవన్ బిరుదు పవర్ స్టార్ అంటే ఫ్యాన్స్ కి మహా ఇష్టం. పవన్ కంటే పవర్ స్టార్ బిరుదుతో ఆయన ఎక్కువగా పిలవబడుతూ ఉంటారు. మరి ఇంతలా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న ఆ పవర్ స్టార్ బిరుదు వెనుక ఆసక్తికర కథనం ఉంది.

నాగబాబు స్థాపించిన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కే సినిమాలకు పవన్ కళ్యాణ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, చిరు సతీమణి సురేఖ సలహా మేరకు పవన్ ని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించారు. అప్పుడు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా మంచి ఫార్మ్ లో ఉన్న ఇవివి సత్యనారాయణను ఎంచుకున్నారు. 

ఇవివి సత్యనారాణ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రాన్ని తెరకెక్కించారు. 1996లో విడుదలైన ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన రియల్ సాహసాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. 


ఇక రెండవ చిత్రంగా తమిళ్ రీమేక్ గోకులంలో సీత చిత్రం చేశారు. ఇది నెగిటివ్ షేడ్స్ కలిగిన హీరో పాత్ర కావడం విశేషం. 1997లో విడుదలైన గోకులంలో సీత హిట్ టాక్ అందుకుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మాటలను పోసాని కృష్ణ మురళి అందించారు.

గోకులంలో సీత మూవీ విడుదలకు ముందు ప్రెస్ మీట్ లో పాల్గొన్న పోసాని కృష్ణ మురళి.. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ పవర్ స్టార్ అని సంబోధించారు. అలా మొదటిసారి పవన్ ని పవర్ స్టార్ అని పిలిచింది పోసాని. ఈ బిరుదు మెగా ఫ్యామిలీకి నచ్చడం జరిగింది. 

ఇక పవన్ కళ్యాణ్ మూడవ చిత్రంగా వచ్చిన సుస్వాగతం టైటిల్ కార్డ్స్ లో పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు వేశారు. దాని ప్రభావమో ఏమో కానీ సుస్వాగతం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పవన్ కి మొదటి బిగ్గెస్ట్ హిట్ సుస్వాగతంతో దక్కింది. 
 


అలా మొదలైన పవర్ స్టార్ ప్రస్థానం ఎవరూ ఊహించని స్థాయికి చేరింది. టాలీవుడ్ టాప్ స్టార్ గా,  పోలి పొలిటీషియన్ గా మారి జనసేనాని అయ్యారు. పవర్ స్టార్ టైటిల్ వెనుకున్న అసలు కథ ఇదన్న మాట. 

click me!