చిరంజీవి బెడ్ రూమ్ లో హీరోయిన్ ఫోటో, ఉదయం లేవగానే మెగాస్టార్ చూసే ముఖం ఎవరిదో తెలుసా?

Published : Apr 14, 2025, 07:47 AM IST

Megastar Favorite Heroine: చిరంజీవికి ఎంతో ఇష్టమైన హీరోయిన్ ఎవరు? మెగాస్టార్ ఎంతో అభిమానించే తార ఎవరు? ఎంతలా అంటే చిరంజీవి బెడ్ రూమ్ లో కూడా ఆ హీరోయిన్ ఫోటో పెట్టుకున్నాడంటే.. ఆమె అంటే ఆయనకు ఎంత ఇష్టమో అర్ధం అవుతుంది. కోట్లాదిమంది ఫ్యాన్స్  ఉన్న మెగా హీరోకు ఫెవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా? 

PREV
14
చిరంజీవి బెడ్ రూమ్ లో హీరోయిన్ ఫోటో, ఉదయం లేవగానే  మెగాస్టార్  చూసే ముఖం ఎవరిదో తెలుసా?
megastar chiranjeevi

Megastar Favorite Heroine: మెగాస్టార్ చిరంజీవి చాలా కష్టపడి ఇండస్ట్రీలో పైకి వచ్చారు. ఎటువంటి బాక్ గ్రౌండ్ లేకుండా అంచలంచలుగా, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. తన టాలెంట్ తో, డాన్స్ మూమెంట్స్ తో, నటనతో కోట్టాది హృదయాలను కొల్లగొట్టారు.

ఇండస్ట్రీలో తాను ఎదగడంతో పాటు ఎంతోమంది కొత్త తారలకు ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్. మరెందరో ఎదుగుదలకు పరోక్షంగా ప్రత్యక్షంగా కారణం అయ్యారు. తన కుటుంబంనుంచి కూడా ఓ పదిమంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసి.. తిరుగులేని మెగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు చిరు.  

Also Read: 1500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాల్లో సమంత. పాన్ ఇండియా హీరోల జంటగా స్టార్ హీరోయిన్

24

ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. 70 ఏళ్లకు అడుగు దూరంల ఉన్న చిరంజీవి తెలుగు పరిశ్రమకు ఎటువంటి సమస్య వచ్చినా ముందు నిలబడి పోరాటం చేస్తున్నాడు. ఎంతో మందికి ఇన్స్ ప్రేషన్ గా నిలిచిన చిరంజీవి తాను ఆదర్శంగా తీసుకున్న నటీనటులు కూడా ఎందరో ఉన్నారు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటివారి అడుగు జాడల్లో నడుస్తూ ఉంటారు మెగా హీరో. అయితే  చిరంజీవికి సబంధించిన ఓ న్యూస్ అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

Also Read: చిరంజీవి గాఢంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నిజమెంత?

34

అదేంటంటే.. మెగాస్టార్ బెడ్ రూమ్ లో ఓ హీరోయిన్ ఫోటో ఉంటుందట. ఆ హీరోయన్ పోటో కరెక్ట్ గా ఆయన బెడ్ కు ఎదురుగా ఉంటుంది, ఉదయం లేవగానే ముందుగా ఆమె ముఖాన్ని చిరు చూస్తారట, ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు మహానటి సావిత్రి. ఈ విషయాన్ని సావిత్రి కూతురు స్వయంగా వెల్లడించారు. ఓ సారి సావిత్రికి సబంధించిన ఓ ఈవెంట్ కు ఆహ్వానించడానికి చిరంజీవి ఇంటికి వెళ్ళారట సావిత్రి కూతురు విజయ. అప్పుడు ఆయన ఈ విషయం చెప్పారట. 

Also Read: రజినీకాంత్ చేతుల్లో దెబ్బలు తిన్న నాగార్జున, ట్విస్ట్ ఏంటంటే?

44

చిరంజీవి ఏమన్నారంటే నా రూమ్ లో సావిత్రమ్మ ఫోటో ఉంటుంది. ఉదయాన్నే ఆమె ముఖాన్నే నేను చూస్తాను అని చెప్పాడంతో పాటు.. ఈ విషయం నమ్ముతారో లేదు అని.. పైన ఉన్న తన బెడ్ రూమ్ నుంచి  నుంచి ఆ ఫోటో కూడా తెప్పించి చూపించారట. ఈ విషయం చెపుతూ.. సావిత్రి కూతుర విజయ ఎంతో సంతోషించారు. ఇలా చిరంజీవి ఆదర్శంగా తీసుకుని, అభిమానించే నటి సావిత్రి. ఆయన ఫేవరెట్ హీరోయిన్  సావిత్రి. 

Also Read: జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ లక్ష్మణుల్లా ఉంటారు, మాజీ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Read more Photos on
click me!

Recommended Stories