ఇండియన్ స్టార్ హీరో, వేల కోట్ల ఆస్తులు ఉన్న స్టార్. రోజుకు కోట్లలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే స్టార్ హీరో.. తన ఇంటిని రెంట్ కు ఇచ్చి... నెల నెలా అద్దె వసూలు చేస్తున్నాడంటే నమ్ముతారా ? అవును కాని ఇది నిజం ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఆ ఇల్లు కూడా ఇక్కడ లేదు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉంది. ఆ ఇంటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Also Read: చిరంజీవి బెడ్ రూమ్ లో హీరోయిన్ ఫోటో, ఉదయం లేవగానే మెగాస్టార్ చూసే ముఖం ఎవరిదో తెలుసా?
షారుఖ్ ఖాన్ కి ఈ బంగ్లాలో అందమైన, అతి పెద్ద బాత్రూమ్ ఉంది. ఒక పెద్ద గది పరిమాణంలో ఉన్న బాత్రూంలో జాకుజీతో పాటు అనేక సౌకర్యాలు ఉన్నాయి.
షారుఖ్ ఖాన్ బంగ్లాను కూడా అద్దెకు ఇస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఈ బంగ్లాలో ఉండాలనుకుంటే, మీరు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. షారుఖ్ ఆస్తులు దాదాపు 8000 కోట్లు, సొంత ఐపీఎల్ టీమ్ తో పాటు ఎన్నో వ్యాపారాల్లో ఆయన పెట్టుబడి పెట్టారు. ముంబయ్ లో ఆయన ఇల్లు 300 కోట్లకు పైగా విలువ చేస్తుంది.
ఇక విదేశాల్లో ఉన్న షారుఖ్ ఖాన్ బంగ్లా అందెద్దకు ఇవ్వబడుతుంది. ఇందులో ఉండటానికి రోజుకు దాదాపు 2 లక్షల రూపాయలు రెంట్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండటానికి. అంతే కాదు ఇలా వెళ్ళి అలా ఉండటానికి కుదరదు.. మీరు ఈ ఇంట్లో ఉండాలి అంటే కొన్ని నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి.
ఈ బంగ్లా షారుఖ్ ఖాన్ ది అని తెలియడంతో.. కాస్త డబ్బున్న ఆయన ఫ్యాన్స్ తో పాటు, సెలబ్రిటీస్ కూడా అలా లాస్ ఏంజిల్స్ కు వెళ్ళినప్పుడు బుక్ చేసుకుంటు ఉంటారు. ఇలా వారికి అద్దెకు ఇవ్వడం ద్వారా షారుఖ్ ఖాన్ ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.