OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ మెమో జారీ చేశారు. ఓజీ సినిమా ఈనెల 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓజీ’(OG). గ్యాంగ్ స్టార్ మూవీ తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ గ్యాంగ్ స్టార్ మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విడుదల తేదీ సమీపిస్తున్న క్రమంలో ప్రమోషన్లు వేగం పెంచింది చిత్ర బృందం.
25
ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – టికెట్ ధరలు పెంపు, బెనిఫిట్ షోలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ రిలీజ్ కోసం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. బుధవారం విడుదల చేసిన జీవో ప్రకారం సెప్టెంబర్ 25న రాత్రి 1 గంటకు బెనిఫిట్ షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ ధరను రూ. 1000 (జీఎస్టీ సహా)గా నిర్ణయించింది. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్స్ టికెట్ రేటు పైగా ₹125 అదనంగా వసూలు చేసుకోవచ్చు. అలాగే.. మల్టీప్లెక్స్‌లు టికెట్ రేటు పైగా ₹150 అదనంగా వసూలు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల ఓజీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
35
తెలంగాణలో సస్పెన్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేక జీవో జారీ చేసింది. కానీ, తెలంగాణలో మాత్రం టిక్కెట్ల పెంపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం వైఖరి ఇంకా స్పష్టంగా లేదు. హై టికెట్ ధరల పెంపు, మిడ్నైట్ షోలపై తెలంగాణ నుంచి పాజిటివ్ సమాధానం వస్తుందా అనే ప్రశ్నపై ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం కూడా టిక్కెట్ ధరల పెంపు, బెనిఫిట్, ప్రిమియర్స్ కు అనుమతులు ఇస్తే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. గ్రీన్ సిగ్నల్ వస్తే, ఓజీ నిజంగా ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోయే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
పవర్ స్టార్ ఓజీ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇందులో ఓజాస్ అనే పవర్ పుల్ రోల్ లో కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓమీ అనే విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ గ్యాంగ్ స్టార్ మూవీకి సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు బాణీలు సమకూర్చారు. ప్రత్యేకంగా జపాన్ సంప్రదాయ వాయిద్యం ‘కోటో’ను ఉపయోగించి కొత్త తరహా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ రికార్డింగ్‌ను లండన్‌లోని ప్రఖ్యాత స్టూడియోలో 117 మంది సంగీతకారులు కలిసి చేశారు. దీంతో ఈ సినిమాలో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
55
ఫెస్టివల్ సీజన్ ఎక్స్ ట్రా బూస్ట్
ఓజీ సినిమాపై పవన్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మూవీ విడుదల కోసం వారంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టార్ మూవీ దసరా సెలవులు సమయంలో విడుదల కావడంతో సినిమా థియేటర్లలో రికార్డు వసూళ్లు వచ్చే అవకాశముంది. టికెట్ రేట్లు పెంచడంపై పవన్ డైహార్డ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓజీ భారీ హైప్, మాస్ అట్రాక్షన్‌తో బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. కానీ, మరోవైపు పెరిగిన టికెట్ ధరలు కుటుంబ ప్రేక్షకులకు భారం అయ్యే అవకాశం ఉన్నదన్న ఆందోళన కూడా పరిశ్రమలో వినిపిస్తోంది. ఫెస్టివల్ సీజన్, మంత్ ఎండ్ సమయంలో ఈ టికెట్ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకర్షిస్తాయో చూడాలి.