Anasuya Bharadwaj: అనసూయకి క్రేజ్‌ తగ్గిందా? ఇదే నిదర్శనం.. నెదర్లాండ్‌లో ఏం చేసిందంటే?

Published : Sep 17, 2025, 09:14 PM IST

Anasuya Bharadwaj: అనసూయ ప్రస్తుతం వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. నెదర్లాండ్‌లో రచ్చ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోల పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇవి చూస్తుంటే అనసూయ క్రేజ్‌ తగ్గిందా అనిపిస్తోంది. 

PREV
16
గ్లామర్‌ ఫోటోలతో తరచూ నెట్టింట రచ్చ చేస్తోంది అనసూయ

Anasuya Bharadwaj: జబర్దస్త్ మాజీ యాంకర్‌, నటి అనసూయ ఎప్పటిలాగే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆమె తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్‌ ధరిస్తూ ఆకర్షిస్తుంటుంది. దీంతో ఆమె ఫోటోలపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెట్టేవారు. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసేవారు. దీనిపై ఆమె కూడా అదే రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చేది. ఇది పెద్ద రచ్చ అయ్యేవి. కొన్ని కేసుల వరకు వెళ్లాయి.

26
దారుణమైన ట్రోల్స్ కి గురైన అనసూయ

జబర్దస్త్ మాజీ యాంకర్‌, నటి అనసూయ ఎప్పటిలాగే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆమె తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్‌ ధరిస్తూ ఆకర్షిస్తుంటుంది. దీంతో ఆమె ఫోటోలపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెట్టేవారు. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసేవారు. దీనిపై ఆమె కూడా అదే రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చేది. ఇది పెద్ద రచ్చ అయ్యేవి. కొన్ని కేసుల వరకు వెళ్లాయి.

36
నెదర్లాండ్‌ వెకేషన్‌లో అనసూయ రచ్చ

తాజాగా అనసూయ నెదర్లాండ్‌లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె ఒక్కతే అక్కడ ఎంజాయ్‌ చేయడం విశేషం. సాధారణంగా ఆమె తన ఫ్యామిలీతో వెళ్తుంది. భర్త, పిల్లలతోనే ఎక్కువగా వెకేషన్‌కి వెళ్తుంది. కానీ ఇప్పుడు వాళ్లెవరూ కనిపించడం లేదు. దీంతో ఒంటరిగానే వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

46
చిలిపి పోజులతో ఆకట్టుకుంటోన్న అనసూయ

ఇందులో అనసూయ నెదర్లాండ్‌ అందాలను అస్వాధిస్తుంది. సముద్రంలో విహరించింది. బోట్‌లో చిలిపి పనులు చేసి ఆకట్టుకుంది. మరోవైపు అక్కడి ఫుడ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ముఖ్యంగా స్నాక్స్, ఐస్‌ క్రీమ్‌ ఫోటోలను పంచుకుంటూ నోరూరిస్తుంది. మరోవైపు ఆమ్సస్టర్‌డమ్‌ నగర వీధుల్లో విహరిస్తూ చిలిపిపోజులిచ్చింది. ఆద్యంతం కనువిందు చేస్తుంది అనసూయ. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

56
అనసూయ క్రేజ్‌ తగ్గిందా?

అనసూయకి జబర్దస్త్ నుంచి తప్పుకున్నాక క్రేజ్‌ తగ్గింది. టీవీలోనూ ఆ క్రేజ్‌ లేదు. ఆమె తనపై వచ్చే వల్గర్‌ కామెంట్లు తన పిల్లలపై ప్రభావం చూపుతాయని భావించి, అదే సమయంలో షోలో కొందరితో పొసగలేక తప్పుకుంది. సినిమాలపైనే ఫోకస్‌ పెట్టింది. ఆ మధ్య వరుసగా సినిమాల్లో కనిపించింది. బలమైన పాత్రలతో మెప్పించింది. `పుష్ప 2`లో మరోసారి ఆమె రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనసూయ చేతిలో మూవీస్‌ లేవు. అధికారికంగా మరే మూవీ ప్రకటన రాలేదు. ఈ క్రమంలో సినిమా ఆఫర్లు కూడా అనసూయకి తగ్గాయా అనే వాదన వినిపిస్తుంది.

66
సినిమాల్లేక టీవీపై అనసూయ ఫోకస్‌

ఇంకోవైపు ఇప్పుడు మరోసారి బుల్లితెరపై సందడి చేస్తుంది. మొన్నటి వరకు `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోలో మెరిసింది. దీనికి జడ్జ్ గా వ్యవహరించింది. దీంతోపాటు పలు ఇతర షోస్ లో మెరుస్తోంది. ఈవెంట్లలోనూ సందడి చేస్తోంది. వ్యక్తిగతంగా ఫ్రీగా ఉండటంతో ఎక్కువగా షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్స్ లో పాల్గొంటూ ఆడియెన్స్ ని అలరిస్తోంది అనసూయ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories