తనూజకి ఇమ్ము ముద్దులు, కళ్యాణ్‌తో రహస్య వ్యవహారాలు.. హద్దులు దాటేస్తున్న రీతూ, పవన్‌ జంట

Published : Sep 17, 2025, 11:39 PM IST

లవ్‌ ట్రాక్‌లతో షోని ఆసక్తికరంగా మార్చేశాడు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు. ఈ క్రమంలో తనూజకి ఇమ్ము ముద్దులు పెట్టడం, రీతూ-పవన్‌ కళ్యాణ్‌.. తనూజ-కళ్యాణ్‌-ఇమ్మాన్యుయెల్‌ ట్రాక్‌లు అదిరిపోయాయి. 

PREV
17
హౌజ్‌లో లవ్ ట్రాక్‌లకు బిగ్‌ బాస్‌ పెద్ద పీఠ

బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో రోజు హౌజ్‌లో లవ్‌ ట్రాక్‌లు హైలైట్‌గా నిలిచాయి. బిగ్‌ బాస్‌ ఎక్కువగా ఈ లవ్ ట్రాక్‌లపైనే ఫోకస్‌ పెట్టారు. గత సీజన్‌లో ఈ ట్రాక్‌లు వర్కౌట్‌ కాలేదు. బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్‌లో వర్కౌట్‌ అయినంతగా ఈ లవ్‌ ట్రాక్‌లు మళ్లీ ఏ జంట విషయంలోనూ వర్కౌట్‌ కాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్‌ బాస్‌ ఆడియెన్స్ కి మసాలా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ లవ్‌ ట్రాక్‌లకు ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పదో రోజు ఈ పులిహోర వ్యవహారాల చుట్టూనే ఎపిసోడ్‌ మొత్తం సాగింది. చివర్లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు.

27
రీతూ చౌదరీకి పవన్‌ పొగడ్తలు

రీతూ చౌదరీ, పవన్‌ కళ్యాణ్‌ మొదటి వారం నుంచి క్లోజ్‌గా ఉంటున్నారు. పవన్‌తో రీతూ పులిహోర కలుపుతూ వచ్చింది. ఇప్పుడు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ కూడా రియాక్ట్ అవుతున్నాడు. బుధవారం ఎపిసోడ్‌లో స్పైసీ యాడ్‌ చేశాడు. రీతూపై ప్రశంసలు కురిపించారు. తను ఏంజెల్‌ అని, చాలా క్యూట్‌గా, అందంగా ఉంటుందని పొగిడాడు. దెబ్బకి ఆమె ఫిదా అయ్యింది. ఇదంతా ఇమ్మాన్యుయెల్‌ సమక్షంలో జరగడం విశేషం. రీతూ కోసం తాను బ్లూ టీ షర్ట్ వేసుకుని వస్తే కనీసం చూడలేదు, మాట్లాడలేదని ఆయన వాపోయాడు.  ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్‌ డిస్కషన్‌ జరిగింది.

37
రీతూ, పవన్‌ లవ్‌ ట్రాక్‌ పీక్‌లోకి

అంతటితో ఆగలేదు. గార్డెన్‌ ఏరియాలో సోఫాలో కూర్చొని ప్రేమ ముచ్చట్లు చెప్పుకున్నారు. తనకు ఛాక్లెట్‌ కావాలని రీతూ అడగ్గా, నేనే ఛాక్లెట్‌ని, నన్నే తినేయు అని ఆయన చెప్పడం క్రేజీగా ఉంది. రీతూ కింద పడకుండా పట్టుకుని నిన్ను వదలను, నువ్వంటే ఇష్టమని చెప్పడం మరింత క్రేజీగా ఉంది. ఇక తనది మట్టి బుర్ర అని పవన్‌ అంటే, తనది పెద్ద మట్టి బుర్రా అని రీతూ చెప్పడం విశేషం. మొత్తంగా వీరి లవ్‌ ట్రాక్‌ మరింత బలంగా ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. కంటెంట్‌ ఇవ్వడంలో పీక్‌లోకి వెళ్లింది.

47
తనూజకి ఇమ్మాన్యుయెల్‌ ముద్దుల వర్షం

ఇక తనూజ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ మరింత క్రేజీగా ఉంది. ఇమ్మాన్యుయెల్‌ గత మూడు నాలుగు రోజులుగా తనూజని గోకుతున్నాడు(కామెడీ కోసం). మొన్న నడుము గిల్లిందని రచ్చ చేసిన విషయం తెలిసిందే. పదో రోజు ఎపిసోడ్‌లో లవర్స్ లాగా మాట్లాడుకుని నవ్వులు పూయించారు. తనూజ అబ్బాయిగా, ఇమ్మాన్యుయెల్‌ అమ్మాయిగా చేశారు. తనూజకి ఫోన్‌ చేసి రొమాంటిక్‌గా మాట్లాడుతూ, ఒక్కట్టే ముద్దులు పెట్టాడు. దీనికి తనూజ కూడా అంతే సరదాగా తీసుకుంది. ఆద్యంతం ఆకట్టుకుంది.

57
తనూజ రహస్యంగా మరో లవ్‌ ట్రాక్‌

ఇంకోవైపు ఇమ్ముకి తెలియకుండా మరో ట్రాక్‌ నడిపించింది తనూజ. కళ్యాణ్‌తో క్లోజ్‌గా మూవ్‌ అయ్యింది. అందుకు కళ్యాణ్‌ కూడా రెచ్చిపోయాడు. ఇద్దరు చూసుకోవడం, గుసగుసలు మాట్లాడుకోవడం చూస్తుంటే క్రేజీగా ఉంది. రెండు సార్లు ఈ ఇద్దరు సీక్రెట్‌గా మాట్లాడుకున్నారు. దీనికి రీతూ ప్రైవసీ కోసం తాను వెళ్లిపోతా అంటే వద్దు ఉండూ అని చెప్పడం, ఆమె డబుల్‌ గేమ్‌కి అద్దం పడుతుంది. ఆ తర్వాత రీతూ, కళ్యాణ్‌ గుసగుసలు పెట్టుకోవడం విశేషం. ఇలా హౌజ్‌లో ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతున్నారు. షో మొత్తం ఇమ్మాన్యుయెల్‌, తనూజ, రీతూ, పవన్ కళ్యాణ్‌ లవ్‌ ట్రాక్‌ల చుట్టూనే సాగుతుంది. మధ్య మధ్యలో హరీష్‌, సంజనా హల్‌చల్‌ చేస్తున్నారు. కళ్యాణ్‌, భరణి, సుమన్‌ శెట్టి కంటెంట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించినా వర్కౌట్‌ కావడం లేదు.

67
ఇమ్మాన్యుయెల్‌కి సంజనా కొత్త బాధ్యతలు అప్పగింత

ఇక పదో రోజు ఎపిసోడ్‌లో హౌజ్‌ క్లీనింగ్‌, కుకింగ్‌ విషయంలో రోల్స్ మార్చేసింది కెప్టెన్‌ సంజనా. బిగ్‌ బాంబ్‌ సుమన్‌ శెట్టిపై ఉండటంతో ఆయన హౌజ్‌ క్లీన్‌ చేస్తుండా, సంజనీ అభ్యంతరం తెలిపింది. తాను ఈ పనితోపాటు కుకింగ్‌లోనూ హెల్ప్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత సంజనా రోల్స్ మార్చేసి ఇమ్మాన్యుయెల్‌ని కుకింగ్‌ సెక్షన్‌ చేసింది. ఈ విషయంలో హరీష్‌ అభ్యంతరం తెలిపారు. సంజనాని టార్గెట్‌ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అంతకు ముందే ఆయన నిద్ర పోతూ కెమెరా కళ్లకి దొరికిపోయాడు హరీష్‌.

77
హోనర్సే దే విజయం

ఇదిలా ఉంటే రెండో వారంలో కెప్టెన్సీ టాస్క్ షూరూ చేశారు బిగ్‌ బాస్‌. టెనెంట్‌, హౌనర్స్ కి మధ్య కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్ ఇచ్చాడు. అందుకోసం కాలమా? చక్రవ్యూహమా? పేరుతో టాస్క్ ఇచ్చాడు. రెండు గ్రూపుల్లో హోనర్స్ కి పది గంటల టైమర్‌ ఉంటే, టెనెంట్‌కి 12 గంటల టైమర్‌ ఉంది. ఎవరి టీమ్‌ మొదట ఆ టైమర్‌ని జీరో చేస్తారో వాల్లే ఇందులో విన్నర్‌. ఈ గేమ్‌ చాలా రసవత్తరంగా సాగింది. ఫైనల్‌గా ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న హోనర్స్ టీమ్‌ విజేతగా నిలిచింది. వారు కెప్టెన్సీ కంటెండర్‌ కోసం పోటీ పడే అవకాశాన్ని పొందారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories