OG First Song: `ఓజీ` ఫస్ట్ సాంగ్‌ వచ్చింది.. ఎలా ఉందంటే?, పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ కోరుకున్నది ఇదేనా?

Published : Aug 02, 2025, 03:53 PM IST

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `ఓజీ` మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ వచ్చింది. పవన్‌ పాత్రని ప్రతిబింబించేలా ఉన్న ఈ పాట అదిరిపోయేలా ఉంది. 

PREV
15
`ఓజీ`తో సందడి షురూ చేసిన పవన్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. ఇటీవలే `హరి హర వీరమల్లు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన్నుంచి సినిమా వచ్చింది. పవన్‌ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. ఫెయిల్యూర్‌ జాబితాలోకి వెళ్లిపోయింది. అయితే ఈ సినిమా ద్వారా పవన్‌ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు. అది ఆడియెన్స్ కి రీచ్‌ అయ్యింది. త్వరలో `ఓజీ`తో ఆయన సందడి చేయడానికి రాబోతున్నారు. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు రాబోతున్నారు.

DID YOU KNOW ?
పవన్‌ అభిమాని
`ఓజీ` చిత్ర దర్శకుడు సుజీత్‌ ఒకప్పుడు పవన్‌ కళ్యాణ్‌ అభిమాని. అదే అభిమానంతో ఈ కథని ఆయన కోసం ప్రత్యేకంగా రాశారు.
25
`ఓజీ` ఫస్ట్ సాంగ్‌ వచ్చింది

పవన్‌ హీరోగా నటించిన `ఓజీ` మూవీ రెండు నెలల గ్యాప్‌తోనే రిలీజ్‌ కానుంది. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 25న విడుదల కాబోతుంది. ఇప్పటికే షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. గతంలో గ్లింప్స్ విడుదల చేయగా, అది సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఫస్ట్ సాంగ్‌తో  ఈ సందడి షురూ చేస్తున్నారు. `ఫైర్‌స్టోమ్‌` పేరుతో సాగే ఈ పాటని మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. నిజానికి సాయంత్రం విడుదల చేయాల్సి ఉండగా, పాట లీక్‌ కావడంతో ముందే విడుదల చేశారు.

35
పవన్‌ పాత్రని ఆవిష్కరించేలా `ఫైర్‌స్టోర్మ్` సాంగ్‌

ఇక విడుదలైన పాట పవన్‌ కళ్యాణ్‌ పాత్రని ఆవిష్కరించేలా సాగుతుంది. ఎక్కువగా ఇంగ్లీష్‌ లిరిక్‌ తో సాగే పాట ఆద్యంతం ఆకట్టుకునేలా, పవన్‌ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. థమన్‌ సంగీతం అందించిన ఈ పాటని విశ్వ, శ్రీనివాస్‌ మౌలి రాయగా, హీరో శింబు, థమన్‌, నజీరుద్దీన్‌, భరత్‌రాజ్‌, దీపక్‌ బ్లూ ఆయా భాషల్లో ఆలపించారు. ఫీమేల్‌ వెర్షన్‌ రాజ కుమారి పాడారు. ఇంగ్లీష్‌ లిరిక్‌ని కూడా ఆమెనే రాయడం విశేషం. ఓ వైపు పవన్‌ కళ్యాణ్‌ పాత్ర ఎలివేషన్లు, మరోవైపు కథని ప్రతిబింబించేలా యాక్షన్‌తో ఈ పాట సాగింది. ఆద్యంతం స్టయిలీష్‌గా  పాట ఉండటం విశేషం. 

45
`ఓజీ` కాస్ట్ అండ్‌ క్రూ

సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన `ఓజీ` మూవీలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్‌ హష్మి నెగటివ్‌ రోల్‌ చేశారు. అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, వెంకట్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

55
ముంబయి మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో `ఓజీ`

ముంబాయి మాఫియా నేపథ్యంలో సినిమా సాగుతుంది. పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించబోతున్నారు. ఇలా పూర్తి స్థాయిలో గ్యాంగ్‌ స్టర్‌ తరహా సినిమాని పవన్‌ చేస్తున్నారు. `పంజా`, `బాలు` వంటి చిత్రాల్లో కొంత మాఫియా టచ్‌ ఇచ్చారు. కానీ `ఓజీ` పూర్తి మాఫియా గ్యాంగ్‌ స్టర్‌ మూవీ కావడం విశేషం. ఈ మూవీపై ఆడియెన్స్‌ లో భారీ అంచనాలున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు, ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ `ఓజీ ఓజీ` అంటూ అరుస్తోన్న విషయం తెలిసిందే. `హరి హర వీరమల్లు` ఈవెంట్లలోనూ, పొలిటికల్‌ ఈవెంట్లలోనూ ఇదే పదం వాడుతూ వస్తున్నారు. ఈ చిత్రం కోసం వారంతా ఎంతో ఆతృతగా ఉన్నారు. దర్శకుడు సుజీత్‌ కూడా ఈ మూవీని ఆద్యంతం స్టయిలీష్‌ గ్యాంగ్‌స్టర్‌ మూవీగా తెరకెక్కించినట్టు సమాచారం. పవన్‌ పవర్‌ని ప్రతిబింబించేలా ఆయన పాత్రతోపాటు సినిమా ఉంటుందని, పూర్తి ఫ్యాన్‌ బాయ్‌ మూమెంట్‌తో మూవీని తెరకెక్కించారని సమాచారం. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories