అనసూయకు సోషల్ మీడియా నుంచి సపోర్ట్
అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి భారీగా షేర్ అవుతున్నాయి. అనసూయ మాటల్లో కనిపించిన ఆవేశం, బాధ అభిమానులనే కాకుండా కామన్ ఆడియన్స్ కు కూడా కోపం తెప్పిస్తున్నాయి. దాంతో జనాలు కూడా ఆలోచనలో పడ్డారు. అనసూయ నటిగా మాత్రమే కాకుండా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గానూ గుర్తింపు పొందారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, లైంగిక వేధింపులపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.ఇక అనసూయపై జరిగిన ఈ ఘటన విషయంలో ఆమె చేసిన కామెంట్స్ కు సోషల్ మీడియాలో మద్దతు పెరిగింది.
ఒకపక్క టీవీ యాంకర్‌గా, మరోపక్క సినీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ పై ఇలా బహిరంగంగా అగౌరవపర్చుతూ కామెంట్లు చేయడం. అసభ్యంగా ప్రవర్తించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనలో పాల్గొన్న యువకులపై స్థానికంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అనసూయ స్పందించిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇలా ప్రతి మహిళ ధైర్యంగా ఎదిరిస్తేనే మార్పు వస్తుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.