గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది, కింగ్డమ్ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ ఇదే.. ఎన్టీఆర్ ఎంట్రీతో..

Published : Aug 02, 2025, 03:38 PM IST

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ వేరే ఉంది. ఆ టైటిల్ ఎందుకు వద్దనుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంతకాలంగా విజయ్ దేవరకొండకి సరైన సక్సెస్ లేదు. కింగ్డమ్ చిత్రం రిలీజైన తొలి రోజు నుంచే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు వర్కౌట్ కాలేదని అంటున్నప్పటికీ ఓవరాల్ గా మూవీ బాగానే ఉందని ప్రేక్షకులు అంటున్నారు. 

DID YOU KNOW ?
అర్జున్ రెడ్డి చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరో
విజయ్ దేవరకంటే ముందుగా అర్జున్ రెడ్డిలో నటించే అవకాశం శర్వానంద్ కి దక్కింది. కానీ తన ఇమేజ్ కి ఆ చిత్రం సెట్ కాదని శర్వానంద్ రిజెక్ట్ చేశారు. 
25
2 రోజుల్లో 53 కోట్ల గ్రాస్ 

ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్ గా 53 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. సినిమా రిలీజ్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ కింగ్డమ్ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ కింగ్డమ్ గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. 

35
కింగ్డమ్ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్

ఇదే  కింగ్డమ్ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ దేవర నాయక. వినగానే గూస్ బంప్స్ తెప్పించేలా ఈ టైటిల్ ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ తెగ ప్రజలకు రాజుగా నటించారు. అందుకే దేవర నాయక అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు. కానీ అదే టైంలో ఎన్టీఆర్ దేవర మూవీ టైటిల్ కూడా ఫిక్స్ అయింది. రెండు టైటిల్స్ ఒకేలా ఉన్నాయనే ఉద్దేశంతో తాము ఈ చిత్రానికి కింగ్డమ్ అని టైటిల్ మార్చినట్లు తెలిపారు. 

45
కింగ్డమ్ పార్ట్ 2పై విజయ్ దేవరకొండ కామెంట్స్ 

అదే విధంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ పార్ట్ 2 గురించి కూడా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రధానంగా కథ ఉంటుంది. కానీ, ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశముంది. అలాగే, ఒక తెగకు చెందిన నాయకుడి గురించి ఉంటుంది. ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండవ భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంగా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది.

55
విజయ్ దేవరకొండకి సుకుమార్ ప్రశంసలు 

డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని చూసి అభినందించినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. సినిమా చూసి సుకుమార్ గారు ఫోన్ చేశారు. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. నాకు సుకుమార్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి ప్రశంస రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories