ఎన్టీఆర్, చిరంజీవి కలిసి `తిరుగులేని మనిషి` అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ సమయంలో మెగాస్టార్‌కి వార్నింగ్ ఇచ్చాడట రామారావు. కానీ చిరు వినలేదు. దీంతో ఆరు నెలలు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందట.
లెజెండరీ నటుడు ఎన్టీఆర్ టాలీవుడ్ సినిమా లెక్కలు మార్చేశారు. తెలుగు సినిమాని కమర్షియల్ వైపు నడిపించారు. దాన్ని చిరంజీవి ముందుకు తీసుకెళ్లారు. చిరంజీవి వచ్చాక తెలుగు సినిమా దశ దిశ మారిపోయిందని చెప్పొచ్చు. పూర్తి కమర్షియల్‌గా టర్న్ తీసుకుంది. ఎన్టీఆర్ సినిమాల నుంచి తప్పుకున్నాక, ఆ లోటుని చిరంజీవి భర్తీ చేశారు. అదే సమయంలో ఆ స్థానాన్ని తను కైవసం చేసుకున్నారు. తిరుగులేని స్టార్‌గా రాణించారు. మెగాస్టార్‌గా ఎదిగారు. అయితే వీరిద్దరి కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించారు. ఆ సమయంలో చిరంజీవికి ఎన్టీఆర్ ఒక వార్నింగ్ ఇచ్చారు. అదేంటనేది చూస్తే.
25
`తిరుగులేని మనిషి`లో నటించిన ఎన్టీఆర్, చిరంజీవి
ఎన్టీఆర్, చిరంజీవి కలిసి `తిరుగులేని మనిషి` అనే చిత్రంలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఒకే ఒక్క చిత్రమిది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రతి అగ్నిహోత్రి హీరోయిన్‌గా నటించింది. ఇది 1981లో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటించలేదు. మేకర్స్ ప్రయత్నాలు చేసినా అనేక కారణాలతో అవి పట్టాలెక్కలేదు. అయితే ఈ సినిమా సమయంలో చిరంజీవికి వార్నింగ్ ఇచ్చాడు ఎన్టీఆర్. యాక్షన్ సీన్లు చేసే సమయంలో చిరంజీవి ఉత్సాహాన్ని, అత్యుత్సాహాన్ని చూసి హెచ్చరించాడట. కానీ చిరంజీవి వినలేదు. దీంతో ఆరు నెలలు మంచానికి పరిమితం కావాల్సి వచ్చిందట.
35
ఆర్టిస్ట్ లు జాగ్రత్తగా ఉండాలని చెప్పినా ఎన్టీఆర్
`తిరుగులేని మనిషి` సినిమాలో యాక్షన్ సీన్లు చేసేటప్పుడు ఓ ఫ్లోర్ నుంచి కిందకు దూకే సీన్లు ఉన్నాయట. అందులో ఇద్దరు పట్టుకుని దూకాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ ఊపు ఇచ్చి ఆగిపోయారు. కానీ చిరంజీవి దూకేశారు. దీంతో ఎన్టీఆర్ ఉండి, `బ్రదర్ అలా దూకేశారేంటి? అలా దూకకూడదు. వాటికి డూపులు ఉంటారు. ఆర్టిస్టులు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏమైనా అయితే అది సినిమాకి చాలా నష్టం. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సమయం వేస్ట్ అవుతుంది. ఫైనాన్సియల్‌గా నష్టాలు వస్తాయి. ఆర్టిస్ట్ లు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి` అని చెప్పారు.
ఎన్టీఆర్ మాట వినని చిరు, ఆరు నెలలు మంచానికే పరిమితం
అప్పుడు ఊ కొట్టాను కానీ ఆ తర్వాత `సంఘర్షణ` అనే సినిమాలో ఒక ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా దూకాను. అప్పుడు కాలు మడతబడి ఆరు నెలలు షూటింగ్ చేయలేకపోయాను. తర్వాత లండన్‌లో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అందుకే పెద్దలు ఎంతో ఆలోచించి ఇచ్చే సలహాలను మనం పాటించాలి` అని తెలిపారు చిరంజీవి. రెండేళ్ల క్రితం లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏయన్నార్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ ఇచ్చిన సలహా తన కుటుంబాన్ని కాపాడుతుందని ఆయన వెల్లడించారు. మొత్తంగా ఎన్టీఆర్ చెప్పిన మాట వినకపోవడం వల్ల చిరంజీవి ఆరు నెలలు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది.
55
బాబీతో సినిమా చేస్తున్న చిరంజీవి
ఇక ప్రస్తుతం చిరంజీవి బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి లుక్ టెస్ట్ చేశారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. ఇందులో మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అలాగే ఓ బాలీవుడ్ యాక్టర్ కూడా నటిస్తారని సమాచారం. మరోవైపు చిరంజీవి నటించిన `విశ్వంభర` మూవీ ఫైనల్ వర్క్ జరుపుకుంటుందని తెలుస్తోంది. దీన్ని జులైలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.