అదుర్స్: ఎన్టీఆర్ సొంత బ్యానర్ పేరు ఇదే, పెట్టేది అందుకే

First Published Mar 27, 2020, 11:55 AM IST

కొత్త నీరు ఇండస్ట్రీలోకి తెగ వస్తోంది. ఆ విషయం మనకు గత రెండేళ్లుగా వస్తున్న సినిమాలను చూస్తే అర్దమవుతుంది. అయితే బయిట ఇంకా చాలా టాలెంట్ ...ఎంకరేజ్మెంట్ కోసం ఎదురుచూస్తోంది. వాళ్లకు పెద్ద హీరోల డేట్స్ అక్కర్లేదు. చిన్న నిర్మాత అయినా తమ దగ్గర ఉన్న కాన్సెప్టుని అందంగా తెరకెక్కించేందుకు సహకరించాలి. 

ఎప్పుడైతే శాటిలైట్ బిజినెస్ పోయిందో అప్పుడే చిన్న సినిమాలు తగ్గిపోయాయి. రియల్ ఎస్టేట్ నుంచి సినిమా ఫీల్డ్ కు రావటం తగ్గిపోయింది. ఈ నేపధ్యంలో టాలెంట్ ని వెలికితీసేందుకు, చిన్న సినిమాను బ్రతికించేందుకు నిర్మాణ సంస్దలు, హీరోలు నడుం బిగించాల్సిన అవసరం ఉంది.

ఈ క్రమంలో ఇప్పటికే కొందరు నిర్మాతలు, హీరోలు సొంత నిర్మాణ సంస్దలు పెడుతున్నారు.నాని వంటి చిన్న హీరో నుంచి మహేష్ వంటి సూపర్ స్టార్స్ సైతం సొంత ప్రొడక్షన్ లోకి దిగారు. ఇది గమనిస్తున్న ఎన్టీఆర్ గత కొంతకాలంగా ఆలోచనలో పడినట్లు చెప్తున్నారు. అందులో ప్లస్ లు, మైనస్ లు ఎంచి, ఓ ప్రణాళికాబద్దంగా ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట.
undefined
సాధారణంగా స్టార్స్ నిర్మించే చిత్రాలు అంటే బిజినెస్ కు క్రేజ్ వస్తుంది. శాటిలైట్, డిజిటల్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి ధైర్యం చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సైతం కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం ఇవ్వాలని డిసైడ్ అయ్యినట్లు చెప్తున్నారు. ఈ మేరకు తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
undefined
ఈ క్రమంలో తను పెట్టబోయే బ్యానర్ కు ఇప్పటికే పేరు సైతం ఫిక్స్ చేసాడని తెలుస్తోంది. అభయ్ హరి ఆర్ట్స్ అని పెట్టబోతున్నారట. తన తండ్రి హరికృష్ణ పేరు, తన పెద్ద కుమారుడు అభయ్ రామ్ పేరు కలిసొచ్చేలా ఈ పేరు పెట్టబోతున్నడట. అయితే దీనిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది.
undefined
బ్యానర్ పెట్టడం అనేది ఖచ్చితంగా జరిగే విషయమే కానీ ఇంకా ఏదీ పూర్తి స్దాయిలో నిర్ణయం కాలేదని, ఎన్ని సినిమాలు చేయాలి..దేనికెంత బడ్జెట్ కేటాయించాలి అనే విషయమై తర్జన బర్జన పడుతున్నారట. అయితే ఓ మార్క్ పెట్టుకుని, ఆ బడ్జెట్ కు తగ్గ కథలే తీసుకుంటారని చెప్తున్నారు.
undefined
అలాగే ఒక సినిమా చేసిన దర్శకుడుకు అవకాసం ఇద్దామా లేక పూర్తిగా కొత్తవారిని ప్రోత్సహిద్దామా అనే ఆలోచన కూడా చేస్తున్నారట. ఆల్రెడీ సినిమా చేసి ప్లాఫ్ అయినా సినిమా తీసే విధానం బాగుంటే వాళ్లను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ సహచరులు సూచిస్తున్నారట.
undefined
ఇక అన్నీ సరిగ్గా సెట్ అయితే వచ్చిన అన్ని స్క్రిప్టులు ముగ్గురు విని, అందులోఫైనల్ గా ఎన్టీఆర్ వినేలా ప్లాన్ చేస్తున్నారట. అప్పుడు బడ్జెట్ లెక్కేసి, ప్రాజెక్టుని పట్టాలెక్కిస్తారట. మొదట ఈ సంవత్సరం మూడు సినిమాలు చేయాలని, వాటిలో ఒకటి సక్సెస్ అయినా మరో మూడు చేయటానికి ధైర్యం వస్తుందని భావిస్తున్నారట.
undefined
అయితే తమ బ్యానర్ లో తీసే సినిమాలకు బడ్జెట్ లిమిట్ పెట్టుకోవాలని డెసిషన్ కు వచ్చారట. రెండు, రెండున్నర, మహా అయితే మూడు కోట్లు లోపే అని ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చారట. కాబట్టి త్వరలో ఎన్టీఆర్ సొంత బ్యానర్ నుంచి మీడియం బడ్జెట్ సినిమాలు వచ్చే అవకాసం ఉంది. దీంతో పెద్దగా నష్టాలు అనేవి ఉండవు. వస్తే లాభాలు. లేదా కొద్దిగా పోతుంది అంతే.
undefined
‘అరవింద సమేత వీర రాఘవ’సినిమాతో హీరోగా 28 సినిమాలు కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్..ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో 29వ సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.
undefined
తాజాగా ఉగాది సందర్భంగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
undefined
దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
undefined
ఇక ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో సినిమా మరోసారి వాయిదా పడుతుందని అందరు అనుకున్నారు. ఎందుకంటే కరోనా ప్రభావం వలన అన్ని షూటింగ్లు ఆగిపోయాయి. RRR కూడా షూటింగ్ వాయిదా పడింది. దీనితో సినిమా మరింత ఆలస్యం కానుందని అనుకున్నారు అంతా.
undefined
కానీ నిన్న విడుదల చేసిన పోస్టర్లో సినిమాని అనుకున్న టైంకే అంటే వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే దిశగా ప్లాన్ చేస్తుందట!
undefined
click me!