టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే ఆ పోటీ తీవ్రంగా ఉంటుంది. బాక్సాఫీస్ లెక్కలపై అందరి దృష్టి పడుతుంది. ఏ సినిమా సక్సెస్ అవుతుంది అనే ఉత్కంఠ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది అగ్ర హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి హీరోల చిత్రాలకు పోటీగా చిరంజీవి సినిమాలు విడుదలయ్యేవి. ఆ తర్వాత బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లతో పోటీ పడ్డారు.