ఓర చూపులతో సెగలు పుట్టిస్తున్న రీతూ.. హౌస్‌లో లవ్ ట్రాక్ షురూ!

Published : Sep 09, 2025, 08:34 AM IST

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ అంటేనే గొడ‌వ‌లు, ల‌వ్ ట్రాక్‌లు. వాటినే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిగా చూస్తారు. ఈ సీజన్‌లో కూడా ఓ లవ్ ట్రాక్ షురూ కాబోతుందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

PREV
15
హౌస్‌లో లవ్ ట్రాక్ షురూ

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 భారీ అంచనాలతో గ్రాండ్ లాంఛ్ అయ్యింది. స్టార్ హోస్ట్ అక్కినేని నాగార్జున ఓపెనింగ్ ఎపిసోడ్‌తోనే వేడి పుట్టించగా, హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు తమ స్టైల్‌లోనే ఎంటర్‌టైన్ చేశారు. తొలిరోజే ఎవరు సూపర్ కంటెంట్ ఇస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చున్నారు. ఆ అంచనాలను దాదాపు నెరవేర్చినట్టే కనిపించింది.

25
దుమ్మురేపిన మాస్క్‌మ్యాన్

బిగ్ బాస్ డే 1 ఎపిసోడ్‌లో ఎక్కువ హైలైట్ అయింది మాస్క్‌మ్యాన్ హరీష్. తన యూనిక్ బాడీ లాంగ్వేజ్, డైలాగులు, పంచులతో హౌస్‌లో హంగామా చేశాడు. సింగిల్ హ్యాండ్‌తోనే సాలిడ్ కంటెంట్ రాబట్టాడు. కానీ ఎపిసోడ్ మొత్తం కేవలం హరీష్‌కే దక్కిందని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఒక చిన్న రొమాంటిక్ సీన్ మాత్రం అన్ని లైమ్లైట్లు దోచుకెళ్లింది.

35
లవ్ ట్రాక్ స్టార్ట్ చేసిన రీతూ చౌదరి

మన జబర్దస్త్ రీతూ చౌదరి ఎంటర్ అయిన వెంటనే తన స్టైల్‌లో ఎంటర్టైన్ స్టార్ చేసింది. షోకు కాస్త మసాలా జోడించింది. మొదటి రోజే లవ్ ట్రాక్‌కు ఎంట్రీ ఇచ్చేసింది. అది కూడా కామనర్ జవాన్ పవన్ కళ్యాణ్‌తో. సరదాగా గేమ్ ఆడదాం అంటూ పవన్‌కు ఛాలెంజ్ విరిసింది. తన చూపులతో ఎలాగైనా గెలుస్తాననీ రంగంలోకి దిగింది. తన ఓర చూపులతో గెలిచేయాలని ప్రయత్నించింది.

45
ఓర చూపులతో రీతూ మాయ

రీతూ పిలువగానే పవన్‌ కూడా సై అన్నారు. “ఎవరు ఎక్కువసేపు కళ్లార్పకుండా ఒకరినొకరు చూస్తారో చూద్దాం” అంటూ టాస్క్ పెట్టింది. పవన్ కూడా వెంటనే అంగీకరించాడు. హౌస్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్లు చుట్టూ చేరి ఈ గేమ్ చూడడం మొదలెట్టారు. గేమ్ స్టార్ట్ అయిన వెంటనే రీతూ పవన్ కళ్లల్లోకి నేరుగా చూసింది. మధ్య మధ్యలో సైలెంట్ స్మైల్స్ ఇచ్చింది. ఓర చూపులు విసిరింది. కొంచెం రొమాంటిక్ ఫీలింగ్ కూడా ఇచ్చేలా రియాక్షన్స్ ఇచ్చింది. కానీ పవన్ మాత్రం ఏమాత్రం కదలలేదు. రెప్ప ఆర్పకుండా కళ్లల్లోకి చూస్తూనే ఉన్నాడు.

55
ఎపిసోడ్ హైలెట్‌గా మారిన లవ్ ట్రాక్

కొన్ని క్షణాల తర్వాత రీతూ కళ్లల్లో నీళ్లు రావడంతో కళ్లార్చేసింది. దీంతో పవన్ విజేతగా నిలిచాడు. ఈ సీన్ చూసిన హౌస్‌మెట్స్ అందరూ చప్పట్లు కొట్టారు. పవన్ ఆనందంతో గట్టిగా రియాక్ట్ చేశాడు. ఈ గేమ్ రెండు నిమిషాలే జరిగినా.. ఎపిసోడ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. గత సీజన్‌లో విష్ణుప్రియ–పృథ్వీరాజ్ లవ్ ట్రాక్ క్రేజ్ క్రియేట్ చేసినట్లు, ఈ సీజన్‌లో రీతూ–పవన్ జంట కొత్త లవ్ యాంగిల్ స్టార్ట్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఇక బిగ్‌బాస్ ఈ ట్రాక్‌ను కొనసాగిస్తాడా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories