Chiranjeevi - Nani Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడైజ్ (Paradise). ఈ సినిమాలో పవర్‌ఫుల్ క్యామియో రోల్ లో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడైజ్ (Paradise).ఈ సూపర్ కాంబో సినిమా మీద రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సెన్సేషనల్ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ ఆ వార్త నిజమైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటీ?
24
నాని కెరీర్ టర్నింగ్ పాయింట్
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. తొలినాళ్లలో లవ్, యూత్, ఫ్యామిలీ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి.. ఇటీవల రూట్ మార్చేశాడు. దసరా సినిమాతో మాస్ ఎంట్రీ ఇచ్చారు. రా అండ్ రఫ్ లూక్ తో తన ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఆ తరువాత హిట్ 3 తో రక్తపాతం సృష్టించాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేశారు.
ఈ సినిమాతో అటు హీరోగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ‘దసరా’,‘హిట్ 3’ వంటి మాస్ మూవీస్‌తో కొత్త ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాని, మళ్లీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో జోడీ కట్టడం సినిమాపై భారీ అంచనాలు రేకెత్తించింది. మాస్ స్లాంగ్, రా అండ్ రగ్గడ్ లుక్‌లో నాని మరోసారి పండగ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
34
30 ఎకరాల భారీ సెట్‌లో షూటింగ్
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’.ఈ సినిమాను ఎస్ ఎల్ వి కసినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.100 కోట్లకు పైగా వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా 80వ దశకంలోని సికింద్రాబాద్ నేపథ్యంలో సాగనుందనే సమాచారం. నాని ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే టాక్ కూడా ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో నాని రగ్గడ్ లుక్‌తో పొడవాటి జడలతో ‘జడల్’ పాత్రలో కనువిందు చేసి, అభిమానుల్లో భారీ అంచనాలు రేపాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో 30 ఎకరాల విస్తీర్ణంలో భారీ మురికివాడ సెట్స్‌ను నిర్మించారు. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు.
ది ప్యారడైజ్ సినిమాలో పవర్‌ఫుల్ క్యామియో కోసం మేకర్స్ ఓ స్టార్ హీరోను ఫైనల్ చేయాలని చూస్తున్నారని సమాచారం. తాజాగా ఆ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. “ది ప్యారడైజ్” తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతోనే ఇప్పుడు క్యామియో రోల్ కోసం చిరంజీవిని అడగగా, మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ఈ చిత్రం మొత్తం 8 భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది మార్చి 26న సమ్మర్ కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి ఎంట్రీ కేవలం కొన్ని నిమిషాలే అయినా.. సినిమా హైప్‌ను డబుల్ చేస్తుందనడంలో సందేహమే లేదు. నాని మాస్ ఇమేజ్, శ్రీకాంత్ ఓదెల రా టేకింగ్, చిరంజీవి పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయమని మూవీ లవర్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇండస్ట్రీ షేక్ అవుతుందనడంతో ఎలాంటి సందేహం లేదు.