శ్రీ భరణీ చిత్ర ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ పై ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. తెలుగు వెర్షన్ లో కృష్ణ, తమిళ వెర్షన్ శివ చంద్రన్ హీరోలుగా నటించారు. ఈసినిమా మొదటిసారి ఫారెన్ షూట్ జరుపుకున్న తెలుగు సినిమాగా రికార్డ్ సాధించింది.
అయితే ఈసినిమాలో ఫారెన్ షూట్ ఏం చేశారంటే..? హరే కృష్ణ హలో రాధలో ఒక పాట, కొన్ని సన్నివేశాలు మినహా మూడొంతులు సినిమా మొత్తాన్ని అమెరికాలోనే షూటింగ్ చేశారట.
అప్పటికే కృష్ణతో బంధం పెంచుకున్న విజయనిర్మల.. ఈమూవీలో నటించకపోయినా.. ఆయనతో కలిసి అమెరికాకు విజయనిర్మల కూడా వెళ్లారు. వంటల్లో స్పెషలిస్టు అయిన విజయనిర్మల.. అమెరికాలో ఉన్నన్ని రోజులు టీమ్ కు ఆమే వంట కూడా చేసి పెట్టారట.
Also Read: అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ఆస్తులు ఎన్ని కోట్లు? బన్నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడ? ఐకాన్ స్టార్ సీక్రేట్ ఇవే