ఇలా మాస్ సినిమా చేయడానికి ఆమె అడిగినవాటికి లారెన్స్ సరే అనడంతో.. అసలు విషయం నాగార్జునకు చెప్పి ఒప్పించారట దర్శకుడు. జ్యోతిక పరిస్థితి అర్దం చేసుకుని నాగార్జున కూడా అందుకు ఒకే అనడంతో సినిమా ముందుకు వెళ్ళింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఊపు ఊపేసింది జ్యోతిక. టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా.. ఆమె ఎక్కువగా నటించింది తమిళంలోనే. తెలుగులో మాత్రం నాగార్జున, చిరంజీవి, రవితేజ, లాంటి స్టార్స్ తో ఆమె నటించారు.