ప్రభాస్ హీరోగా ఓ మైథలాజికల్ మూవీని చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. దీనికి `జటాయు` అనే టైటిల్ అనుకుంటున్నారట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ కాంబినేషన్ సెట్ చేస్తున్నట్టు సమాచారం. ఇంద్రగంటి మోహనకృష్ణ కథ అందిస్తున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రైమరీగా డిస్కషన్ స్టేజ్‌లో ఉంది. దీన్ని ఎలాగైనా వర్కౌట్ చేయాలని దిల్ రాజు స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు పాజిబుల్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు పూర్తి కావడానికే ఇంకా నాలుగైదేళ్లు పడుతుంది.
ఆ తర్వాత అంటే అప్పటి వరకు ట్రెండ్ మారుతుంది? మార్కెట్ మారుతుంది? బిజినెస్ లెక్కలు మారుతాయి. కానీ ఈ వార్త మాత్రం టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.