హీరోగా నువ్వు చేసినా ఓకె, అతడి పక్కన నటించనని డైరెక్టర్ కి చెప్పిన సౌందర్య.. కట్ చేస్తే మూవీ బ్లాక్ బస్టర్

Published : Feb 26, 2025, 06:20 AM IST

టాలీవుడ్ లో దిగ్గజ నటీమణుల్లో సౌందర్య ఒకరు. తనకి పోటీగా ఎంతమంది గ్లామరస్ హీరోయిన్లు ఉన్నా సౌందర్య తన పంథాలో దూసుకుపోయారు. అతిగా గ్లామర్ ప్రదర్శించకుండా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు.

PREV
15
హీరోగా నువ్వు చేసినా ఓకె, అతడి పక్కన నటించనని డైరెక్టర్ కి చెప్పిన సౌందర్య.. కట్ చేస్తే మూవీ బ్లాక్ బస్టర్
Soundarya

టాలీవుడ్ లో దిగ్గజ నటీమణుల్లో సౌందర్య ఒకరు. తనకి పోటీగా ఎంతమంది గ్లామరస్ హీరోయిన్లు ఉన్నా సౌందర్య తన పంథాలో దూసుకుపోయారు. అతిగా గ్లామర్ ప్రదర్శించకుండా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు. అయితే సౌందర్య పిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 

 

25

అప్పుడప్పుడూ హీరోయిన్లు కానీ హీరోలు కానీ కొన్ని కారణాల వల్ల సూపర్ హిట్ చిత్రాలని మిస్ చేసుకుంటుంటారు. సౌందర్యకి కూడా అలాంటి అనుభవం ఉంది. టాలీవుడ్ లో వినోదాత్మక చిత్రాల దర్శకులలో ఎస్వీ కృష్ణారెడ్డి ముందువరుసలో ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఆయన దర్శకత్వంలో తెరకెక్కాయి. ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం మాత్రం యమలీల. 

 

35

టాలీవుడ్ లో సాధారణ కమెడియన్ అలీ అలీని హీరోగా పెట్టి ఎస్వీ కృష్ణారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ చిత్రంలో ఇంద్రజ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రంలో ముందుగా అలికి హీరోయిన్ గా అనుకున్నది సౌందర్యని అని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ఆమె డేట్ల కోసం వెళ్లి అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇచ్చిందట. హీరో అలీ అని తెలిసే సరికి నేను చేయలేను, దానికి చాలా కారణాలు ఉన్నాయి అని చెప్పింది. 

 

45
Yamaleela

ప్రధాన కారణం మాత్రం అలీ. కమెడియన్ పక్కన హీరోయిన్ గా నటించాలంటే కష్టం అని చెప్పిందట. కావాలంటే మీరు హీరోగా నటించండి నాకు అభ్యంతరం లేదు వెంటనే డేట్లు ఇస్తా అని చెప్పిందట. ఎస్వీ కృష్ణారెడ్డి అప్పటికి నటుడిగా కూడా గుర్తింపు పొందారు. కానీ సౌందర్య అలా అనేసరికి ఎస్వీ కృష్ణారెడ్డి షాక్ అయ్యారు. లేదమ్మా ఇది అలీ కోసమే రాసిన కథ అని చెప్పారట. 

 

55

దీనితో సౌందర్య తప్పుకుంది. ఆ తర్వాత ఇంద్రజకి ఆ అవకాశం దక్కింది. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడాది పాటు ఆడిన యమలీల చిత్రం అలీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ విధంగా సౌందర్య తన కెరీర్ లో క బిగ్గెస్ట్ హిట్ చిత్రాన్ని కోల్పోయారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories