నయనతార ముందు చిన్నబోయిన త్రిష, దూసుకుపోతున్న లేడీ సూపర్ స్టార్..

First Published | Oct 17, 2024, 10:26 PM IST

త్రిష, నయనతారా ఇద్దరూ ఒకే తరం హీరోయిన్లు అయినా.., ప్రస్తుతం త్రిష కంటే నయనతారా ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది.

త్రిష, నయనతారా

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏజ్ బార్ అవుతున్నా.. స్టార్లుగా కొనసాగుతూనే ఉన్నారు త్రిష నయనతార. ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న  త్రిష, నయనతారా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 40 ఏళ్ళు అవుతున్నా, ఇప్పటికీ వారి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

ఇద్దరూ బిజీగా నటిస్తున్నారు. త్రిష చేతిలో తెలుగులో 'విశ్వంభర' తమిళం లో అజిత్ 'విడాముయర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ', కమల్ 'థక్ లైఫ్', మలయాళంలో 'ఎవిడెన్స్', అనే 5 సినిమాలు ఉన్నాయి. కానీ ఆమె కంటే నయనతారా ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది. పదిసినిమాలకుపైగా నయన్ ఖాతాలో ఉన్నాయి. 

Also Read: 100 కోట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్.. 7 కోట్లు మాత్రమే తీసుకుని చేసిన సినిమా..?

యూట్యూబర్ డ్యూడ్ విక్కీ దర్శకత్వంలో నయనతారా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'మన్నాంగట్టి'. ఈ చిత్రంలో హాస్యనటుడు యోగిబాబు కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవదర్శిని, గౌరీ శంకర్, నరేంద్ర ప్రసాద్ వంటి పెద్ద తారాగణం నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: ధనుష్, ఐశ్వర్య విడాకులు రద్దు? ఇద్దరిని కలిపింది ఎవరో తెలుసా..? నిజమెంత ?


ఎ.జె.బాలాజీ దర్శకత్వంలో నయనతారా నటించిన 'మూకుత్తి అమ్మన్' సూపర్ హిట్. ఈ చిత్రంలో నయనతారా అమ్మవారిగా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. దాని రెండవ భాగాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు. కానీ ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్స్ సంస్థే  నిర్మిస్తోన్న ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతున్నాయి.

Also Read:మోక్షజ్ఞ కు తల్లి పాత్రలో బాలకృష్ణ హీరోయిన్

టెస్ట్

నయనతారా నటించిన 'టెస్ట్' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో  నయనతారాతో పాటు మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ నటించారు.  క్రికెట్ నేపథ్యంలో రూపొందిన టెస్ట్.. త్వరలో ఓటిటిలో విడుదల కానుంది.

Also Read: పెళ్ళైన రెండేళ్ళకు శుభవార్త చెప్పిన హన్సిక

మోహన్ రాజా దర్శకత్వంలో జయం రవి సరసన నయనతారా నటించిన 'తని ఒరువన్' సూపర్ డూపర్ హిట్. ఆ చిత్రానికి రెండవ భాగం త్వరలో రానుంది. అందులో కూడా నయనతారానే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది జయం రవితో నయనతారా నటించిన మూడవ సినిమా కావడం విశేషం. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్పన్ వర్క్ జరుగుతోంది.  షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 

Also Read: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖరీదైన విడాకులు: టాప్ 10 జంటలు వీళ్ళే..

టాక్సిక్

నయనతారా చేతిలో ఉన్న పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్'. ఈ చిత్రానికి కీర్తి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో యష్ అక్క పాత్రలో నయనతారా నటిస్తున్నారు. ఈ సినిమా  షూటింగ్ ప్రస్తుతం  హైదరాబాద్ లో జరుగుతోంది.

Also Read: బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

పెద్ద నటీమణులైతే కొత్త హీరోలతో జతకట్టడానికి సంకోచిస్తారు. కానీ నయనతారాకు కథ నచ్చితే ఏ హీరోతోనైనా నటిస్తుంది. దానికి ఉదాహరణ యువ నటుడు కవిన్ తో ఆమె నటిస్తున్న పేరులేని చిత్రం. ఈ చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇతను లోకేష్ కనకరాజ్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు.

డియర్ స్టూడెంట్స్

నయనతారా చేతిలో ఉన్న 7వ సినమిా 'డియర్ స్టూడెంట్స్'. మలయాళ చిత్రం ఇది. ఇందులో నివిన్ పౌలీకి జోడీగా నటిస్తోంది నయనతారా. ఈ సినిమాలో ఆమె టీచర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీని షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇలా నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతోంది. త్రిష కంటే కూడా జోరు చూపిస్తోంది. 

Latest Videos

click me!