తాజా సమాచారం ప్రకారం, ధనుష్, ఐశ్వర్య విడాకుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నారట. రజనీకాంత్ ఆరోగ్యమే ఇందుకు కారణం అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ అనారోగ్యానికి కుటుంబ సమస్యలే కారణం అనే చర్చ జరుగుతున్న తరుణంలో, తండ్రి మనశ్శాంతి కోసం ఐశ్వర్య ఈ నిర్ణయం తీసుకున్నారట.
పిల్లలు కూడా తల్లిదండ్రులు కలిసి ఉండాలని కోరుకుంటున్నారట. రజనీకాంత్ కి 'జైలర్' సినిమాకి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, ఐశ్వర్య సినిమా చూసిన థియేటర్ లోనే ధనుష్ కూడా సినిమా చూశాడు. ఇవన్నీ చూస్తుంటే, మళ్ళీ కలిసి ఉండటానికి సిద్ధమైనట్టు, త్వరలో శుభవార్త వస్తుందని తెలుస్తోంది.
Also Read: బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.