100 కోట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్.. 7 కోట్లు మాత్రమే తీసుకుని చేసిన సినిమా..? కారణం ఏంటో తెలుసా..?

First Published | Oct 17, 2024, 8:26 PM IST

పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. రెమ్యునరేషన్ విషయంలో 100 కోట్ల హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో స్టార్స్ లిస్ట్ లో ముందున్న తారక్.. కేవలం 7 కోట్లు మాత్రమే తీసకుని చేసిన సినిమా ఎదో తెలుసా..? 

పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా దేవర సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు తారక్.  పాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నారు.  ఆర్ఆర్ఆర్ తరువాత చాలా గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు.. ఆర్ఆర్ఆర్ తో పాటుగా వరుస‌గా రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. 

Also Read: మోక్షజ్ఞ కు తల్లి పాత్రలో బాలకృష్ణ హీరోయిన్
 

రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ఈరెండు సినిమాలతో దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక వరుసగా మరో మూడు పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు తారక్.

ఇప్పటికే ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి వరుసగా హిట్లు కొడుతున్నాడు. దాదాపు  వరుసగా ఏడు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కావడంతో.. ఆయన రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది.

గతంలో పెద్ద సినిమాలకు 40 కోట్ల వరకూ తీసుకున్న ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ టైమ్ లో 70  కోట్ల వరకూ ఎదిగాడు ఆతరువాత ఆయన రేంజ్ మారిపోవడంతో.. అది ఇంకాస్త పెరిగిపోయి.. 70 నుంచి 100 కోట్ల వరకూ వచ్చిందట. 

Also Read:  బ్రహ్మానందం - ఆలి ఆల్కాహాల్ తాగకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?


NTR, SS Rajamouli, Devara

దేవర సినిమాకు తారక్‌కు రూ.80 నుంచి రూ.90 కోట్ల వరకు ముట్టినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. మరో వాదన ఏంటంటే.. ఆయన ఈసినిమాకు 100 కోట్లకు పైగా తీసుకున్నట్టు   ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో 30 నుంచి 40 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకునే టైమ్ లో ఎన్టీఆర్ ఓ సినిమాకు 7 కోట్లు మాత్రమే తసుకున్నాడని తెలుసా..? ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. నాన్నకు ప్రేమతో. 

Also Read:  శ్రీదేవికి చిరంజీవి భార్య చేసిన ఆ కూర ఎంత ఇష్టమో తెలుసా, హైదరాబాద్ వస్తే.. మెగా వంట టేస్ట్ చేయాల్సిందే..?

తారక్ నటించిన నాన్నకు ప్రేమతో.. సుకుమార్ దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా.. 2016 సంక్రాంతి కానుకగా నాలుగు సినిమాల మధ్యలో పోటీగా రిలీజై సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ కేవలం రూ.7 కోట్ల 33 లక్ష‌లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారట. ఇలా ఇత తక్కువ పారితోషికం.. స్టార్ హీరో అయిన తారక్ తీసుకోవడం వెనుకు కూడా ఓ కారణం ఉందట. 

Also Read:  హీరోయిన్ ఎంగిలి నేను తాగాలా... డైరెక్టర్ పై మహేష్ బాబు సీరియస్.. ఎవరా హీరోయిన్..?

నాన్నకు ప్రేమతో సినిమా.. కమర్షియల్గా హిట్‌గా నిలవడంతో పాటు.. మంచి లాభాలు కూడా తీసుకువచ్చింది. ఎనిమిదేళ్ళ క్రితం 55 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా .. 55 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగి దాదాపు అవే కలెక్షన్స్ ను సాధించింది. ఇక్కడి విషయం ఏంటంటే.. నాన్నకు ప్రేమతో సినిమాను నిర్మించిన  బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో గతంలో  ఊసరవెల్లి సినిమాను నిర్మించారు. కాని ఈసినిమా ప్లాప్అయ్యింది. నష్టాలు తెచ్చింది. 


Also Read: పెళ్ళైన రెండేళ్ళకు శుభవార్త చెప్పిన హన్సిక

అందుకే నాన్నకు ప్రేమతో మూవీకి ఎన్టీఆర్ తక్కువ రెమ్యున‌రేషన్ తీసుకుని నిర్మాత బోగవల్లి ప్రసాద్‌కు వచ్చిన నష్టాలను అలా భర్తీచేసారంట. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని..  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్మాతల గురించి ఇంతలా ఆలోచిస్తాడా అని తారక్ ను పొగిడేస్తున్నారు. ఇక ప్రస్తుతం  దేవర సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో.. సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు  జూనియర్ ఎన్టీఆర్. నెక్ట్స్ బాలీవుడ్ లో వార్‌2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌ సినిమాలలో నటిస్తున్నాడు.

Latest Videos

click me!