నాని-కార్తీ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ, ఆ సినిమా ఏదో తెలిస్తే షాక్ అవుతారు?

Published : Apr 03, 2025, 10:22 AM IST

Nani, Karthi Multi Starrer Movie : ఈమధ్య మల్టీస్టారర్ మూవీస్ మళ్లీ ఊపందుకున్నాయి. స్టార్ హీరోలు కలిసి నటించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ హీరో నాని, కోలీవుడ్ హీరో కార్తీ కాంబోలో మూవీ రాబోతోందట. ఇంతకీ ఆమూవీ ఏదో తెలిస్తే షాక్ అవుతారు?

PREV
15
నాని-కార్తీ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ, ఆ సినిమా ఏదో తెలిస్తే షాక్ అవుతారు?
Nani, Karthi Multi Starrer Movie :

Nani, Karthi Multi Starrer Movie : ఆర్ఆర్ఆర్ హిట్ తరువాత మల్టీ స్టారర్ మూవీస్ ఊపందుకున్నాయి. ఫుల్ లెన్త్ మల్టీ స్టారర్ కాకపోయినా.. స్టార్ హీరోలు ఒక సినిమాలు కలిసి నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గెస్ట్ రోల్ చేయడానికి కూడా ఎక్కువగా ముందుకు వస్తున్నారు. కన్నప్పలో ప్రభాస్, కల్కీలో కమల్ హాసన్...ఇలా స్టార్స్ కలిసి నటించే సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈక్రమంలో ఓ మల్టీ స్టారర్ మూవీ గురించి న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నటించేది ఎవరో కాదు  న్యాచురల్ స్టార్ నాని, తమిళ హీరో కార్తి. 

Also Read:  మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?

25
Hit 3 Teaser:

నాని సినిమాలు ఈమధ్య చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. దసరా సినిమా టైమ్ నుంచి తన సినిమాల రూట్ మార్చేశాడు నాని. కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నాని హిట్ 3 మూవీ చేస్తున్నాడు. అటు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఇక హిట్ 3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు నాని. 

Also Read:  ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?

35
Nani, Karthi Multi Starrer Movie :

ఇప్పటికే  టీజర్, పోస్టర్లతో హిట్ 3 సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచేస్తూ వస్తున్నారు టీమ్. ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా కనిపించిన నానిలో సీరియస్ యాంగిల్ చూడబోతున్నాడు దర్శకుడు. నానిని సరికొత్తగా చూపించబోతున్నాడు  డైరెక్టర్ శైలెష్ కొలను. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా కెజియఫ్ ఫేమ్, కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది.  షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా హిట్ 3ని కంప్లీట్ చేసి, రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు టీమ్. ఇక ఈక్రమంలో ఈసినిమాకు సబంధించి సాలిడ్ రూమర్ ఒకటి బయట షికారు చేస్తోంది. 

Also Read: బాహుబలితో పాటు సూర్య వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏవో తెలుసా?

45
Nani, Karthi Multi Starrer Movie :

హిట్ 3 మూవీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో నానితో పాటు తమిళ స్టార్ హీరో కార్తి కూడా కనిపించబోతున్నాడట.  ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. నాని తో పాటు కార్తీ ఈ మూవీలో  స్పెషల్ రోల్ చేయనున్నాడట. ఈ సినిమాలో కార్తీ పాత్ర కూడా డిపరెంట్ గా ఉంటుందని సమాచారం. మరి కార్తీది గెస్ట్ రోలా..? లేక ఈక్వల్ రోల్ ఆ.. అసలు ఈ విషయంలో నిజం ఎంతా  అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకూ అయితే మూవీ టీమ్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. 

Also Read: వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

55
Nani, Karthi Multi Starrer Movie :

అయితే హిట్ 3లో  కార్తీ కీలకపాత్రలో కనిపిస్తాడని.. ఈమూవీలో ఆయన పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. కాని తర్వాత ఈ సినిమాకు మరో సీక్వెల్ గా రాబోయే  హిట్ 4లో మాత్రం.. కార్తీది లీడ్ రోల్ అంటున్నారు. నాని  హిట్ 3 మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ, తమిళం సహా వివిధ భాషలలో ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఇక గతంలో కూడా కార్తి టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీలో నటించారు. నాగార్జున తో ఊపిరి సినిమాలో కార్తి  సందడి చేశారు.వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. 

Also Read: రిషబ్ శెట్టి కాంతార 1 రిలీజ్ వాయిదా పడిందా? మూవీ టీమ్ ఏమంటున్నారంటే?

Also Read: రామ్ చరణ్ మిస్ అయిన టాప్ 5 సినిమాలు ఏవో తెలుసా?

Read more Photos on
click me!

Recommended Stories