మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?

మోక్షజ్ఞ ఎట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురవుతోంది. నందమూరి వారసుడి ఫస్ట్ సినిమా ఎప్పుడు వస్తుందనే క్లారిటీ ఇచ్చేవారు లేక అభిమానులు కన్ ఫ్యూజన్ లో పడ్డారు. ఇక తాజాగా మోక్షజ్ఞ కోసం కొత్త డైరక్టర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 

Mokshagna Nandamuri

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై చిక్కుముడులు ఇప్పటికీ వీడటం లేదు.  చాలా కాలంగా నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైమ్ ఇంకా లేట్ అవుతూనే ఉంది. ఇదిగో అదిగో అంటూ.. మోక్షజ్ఞ   ఎంట్రీ లేట్ చేస్తూ వచ్చారు. ఇక ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ  సినిమాను అనౌన్స్ చేశారు. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారని ఫ్యాన్ కాస్త సంతోషించేలోగా..  ఏమైందో ఏమో తెలియదు కాని... ఈ షూటింగ్ ఆగిపోయింది. కారణం ఏంటి అని అడిగితే.. రకరకాలుగా చెపుతూన్నారు. 

Also Read:  ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?

సోషల్ మీడియాలో అయితే మోక్షజ్ఞ సినిమాపై పదిరకాలుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి సినిమా ఆగిపోరయిందని. ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ నుంచి ఔట్ అయ్యాడని టాక్ గట్టిగా వినిపించింది. కాని ఇంత వరకూ అఫీషియల్ గా మాత్రం ఏ విషయం బయటకు రాలేదు.  దాంతో బాలయ్య ఫ్యాన్స్ కు ఉత్సాహం నీరుగారిపోతుంది. మోక్షజ్ఞ ను త్వరగా తెరపై చూడాలి అనుకుంటే, ఇలా జరుగుతంది ఏంటి అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఈక్రమంలో తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతోంది. 

Also Read:  బాహుబలితో పాటు సూర్య వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏవో తెలుసా?


మోక్షజ్ఞ  కోసం మరో స్టార్ డైరెక్టర్ ను రంగంలోకి దింపబోతున్నాడట బాలయ్యబాబు. ఈయంగ్ హీరోతో సినిమా చేయడానికి నాలుగురైదుగురు దర్శకులు రెడీగా ఉన్నారని సమాచారం. మరి ప్రశాంత్ వర్మతో సినిమా కంటీన్యూ చేయిస్తార లేదా తెలియదు కాని.. మోక్షజ్ఞ  ఎంట్రీ అన్నప్పటి నుంచి మేం చేస్తాం అంటూ.. డైరెక్టర్లు క్యూ కట్టారట.  ఇక తాజాగా మోక్షజ్ఞ  కోసం డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ మంచి కథను రెడీ చేశారని తెలుస్తోంది.  ఈ కథ బాలయ్య కూడా విన్నారని ..దాంతో వెంకీతో మోక్షజ్ఞ  సినిమా ఫిక్స్ అయినట్టు సమాచారం. 

Also Read: వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

Mokshagna Teja son of nandamuri balakrishna to debut as an actor in telugu cinema

వెంకీ అట్లూరి ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలు చేశారు. స్టార్ హీరోలతో పనిచేశారు. థనుష్ తో సార్ మూవీ, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ మూవీస్ ను డైరెక్ట్ చేసిన వెంకీ...బాలయ్య తనయుడికోసం మంచి స్టోరీ సెట్  చేశాడట. మరి  మోక్షజ్ఞ  ఫస్ట్ సినిమాకు దర్శకుడు ఎవరు అవుతారు? ఎవరి సినిమా ముందు వస్తుంది.? ప్రశాంత్ వర్మ, లేక వెంకీ అట్లూరినా.. ఇంకా ఎవరైనా అయి ఉంటారా? కొన్ని రోజులు వెయిట్  చేస్తే తెలుస్తుంది.  ఇక ఈలోపు బాలకృష్ణ ప్లాన్ ఏంటో తెలియక ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. 

Also Read:  వివాదంలో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు, దారుణంగా తిడుతున్న నెటిజన్లు ఎందుకంటే?

Latest Videos

click me!