2025 తెలుగు బ్లాక్ బస్టర్‌ మూవీస్‌.. `సంక్రాంతికి వస్తున్నాం`, `డాకు`, `తండేల్‌`, `కోర్ట్`, `మ్యాడ్‌ 2`

Published : Apr 03, 2025, 09:42 AM IST

2025 Telugu Block Buster Movies: తెలుగు సినిమాకి సంబంధించి ఇప్పటికే మూడు  నెలలు పూర్తయ్యింది. మరి ఈ మూడు నెలల్లో బ్లాక్‌ బస్టర్‌ అయిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. 

PREV
16
2025 తెలుగు బ్లాక్ బస్టర్‌ మూవీస్‌.. `సంక్రాంతికి వస్తున్నాం`, `డాకు`, `తండేల్‌`, `కోర్ట్`, `మ్యాడ్‌ 2`
daaku maharaaj, sankranthiki vasthunam, thandel

2025 Telugu Block Buster Movies: సినిమాల సక్సెస్‌ రేట్‌ చాలా తగ్గిపోతుంది. ఏడాదికి రెండు వందలకుపైగా చిత్రాలు విడుదలైతే అందులో పది నుంచి పదిహేను చిత్రాలు మాత్రమే సక్సెస్‌ అవుతున్నాయి. మిగిలినవన్నీ పరాజయం చెందుతున్నాయి.

మరి ఈ ఏడాది ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. `సంక్రాంతికి వస్తున్నాం`, `డాకు మహారాజ్‌`, `తండేల్‌`.. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు విజయం సాధించాయో ఓ లుక్కేద్దాం. 

26
sankranthiki vasthunam

జనవరి నెలలో మొత్తం 16 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కేవలం రెండే రెండు సినిమాలు విజయం సాధించాయి. వాటిలో వెంకటేష్‌ హీరోగా ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా ఒకటి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 
 

36
Nandamuri Balakrishna Daaku Maharaaj

అదే నెలలో బాలకృష్ణ హీరోగా నటించిన `డాకు మహారాజ్‌` కూడా హిట్‌ ఖాతాలోనే పడింది. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాగానే ఆడింది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా, నాగవంశీ నిర్మించారు. ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాబీ డియోల్‌ విలన్‌. ఈచిత్రం సుమారు రూ. 150కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. 

46
thandel

ఫిబ్రవరిలో 14 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కేవలం నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన `తండేల్‌` ఒక్కటే సక్సెస్‌ అయ్యింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ నిర్మించింది. ఈ మూవీ వంద కోట్లు వసూలు చేసింది. 
 

56
court movie review

మార్చి నెలలో 22 సినిమాలు విడుదలైతే రెండే రెండు సక్సెస్‌ అయ్యాయి. నాని నిర్మించిన `కోర్ట్` పెద్ద హిట్‌ అయ్యింది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది. ఇందులో శివాజీ, ప్రియదర్శి, కుర్ర హీరో హర్ష్‌ నటించారు. కోర్ట్ రూమ్‌ డ్రామాగా ఇది ఆకట్టుకుంది. ప్రశంసలందుకుంది. 

66
Mad Square movie , mad 2

ఇక మార్చి నెలకి ముగింపు పలికింది `మ్యాడ్‌ స్వ్కేర్‌`. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌,నార్నే నితిన్‌ హీరోలుగా నటించారు. నాగవంశీ నిర్మించిన ఈ మూవీ రెండేళ్ల క్రితం వచ్చిన `మ్యాడ్‌`కి సీక్వెల్‌.

ఈ మూవీ ఇంకా థియేటర్లో ఆడుతుంది. ఇప్పటికే రూ. 75కోట్లకుపైగా వసూళ్లని సాధించింది. వందకోట్ల దిశగా వెళ్తుంది. మూడు నెలల్లో 52 సినిమాలు విడుదల కాగా, 5 మాత్రమే సక్సెస్‌ కావడం గమనార్హం. 

read  more: క్యాబరే డాన్స్ తో ఊపేసిన డిస్కో శాంతి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

also read: వాటిని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న దుల్కర్ సల్మాన్.. సర్జరీకి ముందు ఎలా ఉండేవారో చూడండి!

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories