Nandamuri Chaitanya: నందమూరి చైతన్య కృష్ణ తమ కుటుంబ ఆస్తులు, వాటి నిర్వహణ గురించి వివరించారు. రామకృష్ణ 70ఎంఎం థియేటర్, స్టూడియోలతో పాటు, తాతగారి వారసత్వం, నాన్న లో ప్రొఫైల్ జీవితం వెనుక కారణాలు తెలిపారు.
నందమూరి చైతన్య కృష్ణ తన తొలి చిత్రం బ్రీత్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తమ కుటుంబ చరిత్ర, ఆస్తుల నిర్వహణ, నందమూరి కుటుంబ సభ్యుల విశేషాలపై అనేక విషయాలను పంచుకున్నారు.
25
తమకు రామకృష్ణ 70ఎంఎం థియేటర్
నందమూరి తారక రామారావు వారసత్వ ఆస్తుల్లో భాగంగా తమకు రామకృష్ణ 70ఎంఎం థియేటర్ వచ్చిందని తెలిపారు. ఈ థియేటర్ సికింద్రాబాద్‌లో ఎక్కువగా హిందీ సినిమాలను ప్రదర్శించేదని పేర్కొన్నారు. చైతన్య కృష్ణ తండ్రి, నందమూరి జయకృష్ణ కుటుంబ ఆస్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారని, 70ఎంఎం థియేటర్, 35ఎంఎం థియేటర్, హోటల్, స్టూడియో వంటి వాటిని చూసుకునేవారని వివరించారు.
35
ఆయన లో-ప్రొఫైల్‌లో..
ఈ బాధ్యతల కారణంగానే ఆయన లో-ప్రొఫైల్‌లో ఉన్నారని తెలిపారు. తాత ఎన్టీఆర్ శంషాబాద్‌లో 250 ఎకరాల ఫామ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేశారని, దానిని కూడా జయకృష్ణ చూసుకున్నారని, అయితే తర్వాత దాన్ని అమ్మేశారని చెప్పుకొచ్చారు. సాయికృష్ణ రామకృష్ణ 35ఎంఎం, రామకృష్ణ గ్లిటరేటి థియేటర్‌లను నిర్వహిస్తుండగా, హరి హోటల్‌ను, మోహన్ తారక రామ థియేటర్‌ను చూసుకుంటున్నారని తెలిపారు.
స్టూడియోలో అందరూ భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. చిన్న బాబాయ్ జయశంకర్ కృష్ణ చెన్నైలోని బజుల్లా రోడ్‌లో ఒక ఇంటిని కలిగి ఉన్నారని, స్టూడియోలో ల్యాండ్, భవనం కూడా ఉన్నాయని, ఆయన ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారని వెల్లడించారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు మారినందున చెన్నైలోని టీ. నగర్ ఇంటిని మ్యూజియంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ వస్తువులతో కూడిన పెద్ద మ్యూజియం అమరావతిలో నిర్మించడానికి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారని, దీనికి 400-500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారన్నారు.
55
బాలకృష్ణ వరుస విజయాలతో..
నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారని తెలిపారు. బాలకృష్ణ క్రమశిక్షణ, అంకితభావం, కృషి, నిరంతరం పని చేసే తత్వం, సంభాషణలను గుర్తుంచుకునే శక్తి ఎన్టీఆర్ నుంచి వచ్చినవని తెలిపారు. ఉదయం 3 గంటలకే లేచి పూజ, జిమ్ చేయడం వంటి దినచర్యలను ఆయన పాటించడం విశేషం అని అన్నారు. బాలకృష్ణకు రాజ్ కపూర్ అంటే ఎంతో ఇష్టమని, బాల్యంలో రామకృష్ణ 70ఎంఎం థియేటర్‌లో హిందీ సినిమాలు ఎక్కువగా చూసేవారని చెప్పారు.