రానా దగ్గుబాటి హీరోగా 'ది ఘాజీ ఎటాక్' అనే చిత్రాన్ని ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో తీశారు. ఈ సినిమా 2017లో విడుదలైంది. దీని బడ్జెట్ రూ.15 కోట్లు, బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు వసూలు చేసింది. డీసెంట్ హిట్‌గా నిలిచింది. మంచి ప్రశంసలందుకుంది. ఇది హిందీతోపాటు తెలుగులో కూడా రూపొందింది. బెస్ట్ పేట్రియాటిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వీటితోపాటు తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా `ఆర్‌ఆర్‌ఆర్`, అడవిశేషు హీరోగా `మేజర్`, చిరంజీవి హీరోగా `సైరా నరసింహారెడ్డి`, శ్రీకాంత్ హీరోగా `ఖడ్గం`, కృష్ణ హీరోగా `అల్లూరి సీతారామరాజు`, ఎన్టీఆర్, మోహన్ బాబు `మేజర్ చంద్రకాంత్`, ఎన్టీఆర్ `నాదేశం`, `బొబ్బిలి పులి`, విజయశాంతి `నేటి భారతం`, కమల్ హాసన్ `భారతీయుడు`, వెంకటేష్ `సుభాష్ చంద్రబోస్` వంటి చిత్రాలు దేశ భక్తి ప్రధానంగా రూపొందాయి. మంచి ఆదరణ పొందాయి.