Hanu Raghavapudi: ప్రభాస్‌తో తాను చేయబోయే సినిమా కథ చాలా కొత్తగా, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు. నానితో అనుకున్న ఆర్మీ కథ ఇది కాదని స్పష్టం చేశారు.
దర్శకుడు హను రాఘవపూడి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, ఇంతవరకు చూడని అద్భుతమైన కథాంశంతో ఉంటుందని ఆయన తెలిపారు.
25
ఆర్మీ బ్యాక్‌డ్రాప్ కథే ప్రభాస్‌తో..
నానితో అనుకున్న ఆర్మీ బ్యాక్‌డ్రాప్ కథే ప్రభాస్‌తో చేస్తున్నారన్న వార్తలపై హను రాఘవపూడి స్పష్టతనిచ్చారు. తాను గతంలో చాలా ఆర్మీ బ్యాక్‌డ్రాప్ కథలను రాసుకున్నానని, అయితే ప్రభాస్‌తో తీస్తున్న కథ పూర్తిగా భిన్నమైనదని ఆయన తేల్చి చెప్పారు. నాని కోసం రాసిన కథ వేరని, ఈ సినిమా కథ ప్రభాస్ కోసమే ప్రత్యేకంగా రూపొందించానని తెలిపారు. దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ కథ కోసం శ్రమించానని, సీతారామం తర్వాత ఈ స్క్రిప్ట్‌పైనే పూర్తి దృష్టి సారించినట్లు ఆయన వివరించారు.
35
ఇమాన్విని ఎంపిక చేయడంపైనా..
ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇమాన్విని ఎంపిక చేయడంపైనా హను రాఘవపూడి మాట్లాడారు. ఇమాన్విని తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశానని, ఆమె అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిపారు. ఆమె నటనపై ఆసక్తి చూపించడం, పాత్రకు ఆమె సరిపోవడం లాంటి కారణాల వల్ల ఆమెను ఎంపిక చేసినట్లు చెప్పారు.
ఈ ఫౌజీ సినిమాలో ప్రభాస్ లుక్, క్యారెక్టర్ అన్నీ సర్‌ప్రైజ్‌లే అని హను రాఘవపూడి సమాధానం ఇచ్చారు. ప్రభాస్ పాత్ర ప్రభావం మాటల్లో చెప్పలేనంతగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒకానొక దశలో ప్రభాస్‌తో సినిమా చేయడం అసాధ్యం అని తాను భావించానని, కానీ విధి తనను ప్రభాస్‌తో కలిపిందని అన్నారు.
55
ఏ దర్శకుడికైనా ప్రభాస్‌తో..
ఏ దర్శకుడికైనా ప్రభాస్‌తో పనిచేయడం ఒక ఆనందకరమైన విషయమని, అది తనకు కాస్త ముందుగానే లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సీతారామం ఈవెంట్‌కు ప్రభాస్ గెస్ట్‌గా రావడం, ఆ తర్వాత ప్రభాస్‌తో ఈ కథను చర్చించి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రభాస్ కథ విని చాలా ఉత్సాహపడ్డారని పేర్కొన్నారు.