టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు చేస్తున్న సినిమాలే చేయడానికి నువ్వెందుకు ఇండస్ట్రీలో ఉండడం అనే ప్రశ్న అగ్ర హీరో కొడుక్కి ఎదురైందట. ఆ హీరో ఎవరు.. అలా ప్రశ్నించింది ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
చిత్ర పరిశ్రమలోకి అగ్ర నటులు, దర్శకులు, నిర్మాతల వారసులు ఎంట్రీ ఇవ్వడం సహజమే. కానీ అందరి వారసులు సక్సెస్ కాలేకున్నారు. కొందరు మాత్రమే వారసత్వంగా వచ్చిన క్రేజ్ ని కష్టపడుతూ తమ ప్రతిభతో నిలబెట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో స్వర్గీయ ఎన్టీ రామారావు తనయులు, మనవళ్లు రాణిస్తున్నారు. అదే విధంగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు.. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ప్రభాస్.. రామానాయుడు ఫ్యామిలీ నుంచి వెంకటేష్, రానా దగ్గుబాటి.. చిరంజీవి, అల్లు అరవింద్ ఫ్యామిలీల నుంచి పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ ఇంకా మరికొందరు హీరోలు రాణిస్తున్నారు.
25
అక్కినేని ఫ్యామిలీ హీరోలు
అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున ఏఎన్నార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోగా ఎదిగారు. నాగార్జున కొడుకులుగా నాగ చైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. నాగ చైతన్య తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకున్నారు. కానీ అఖిల్ ఇంకా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అఖిల్ అనే చిత్రంతో అఖిల్ కి ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ లభించింది.
35
అఖిల్ కి అన్నీ ఫ్లాపులే
తొలి చిత్రం నుంచి ఏజెంట్ వరకు అఖిల్ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. తొలి సక్సెస్ కోసం ఈ అక్కినేని వారసుడు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. అఖిల్ ఇటీవలే వివాహ బంధంలోకి కూడా అడుగుపెట్టాడు. అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
అఖిల్ తొలి సినిమాలో నటిస్తున్న సమయంలో నాగార్జున ఓ సలహా ఇచ్చారట. ఇండస్ట్రీలో రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు ఉన్నారు. వారు చేస్తున్న తరహా కథలే నువ్వు కూడా చేస్తే.. నువ్వెందుకు ఇండస్ట్రీలో ఉండడం. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కదా అని అడిగారట. నీకు గుర్తింపు రావాలి అంటే వారికంటే భిన్నంగా అలోచించి వైవిధ్యమైన కథలు చేయాలి అని అఖిల్ కి చెప్పారట.
55
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మూవీ
కానీ అఖిల్ తండ్రి సలహాని పాటించాడో లేదో తెలియదు. అఖిల్ చేసిన సినిమాలన్నీ కమర్షియల్ ఫార్మాట్ లో సాగే ఫార్ములా కథలే అని చెప్పాలి. అందుకే ఏదీ వర్కౌట్ కావడం లేదు. ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న లెనిన్ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ మూవీతో అయినా అఖిల్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.