
మెగాస్టార్ చిరంజీవి సాధారణ నటుడిగా కెరీర్‌ని ప్రారంభించి స్టార్‌గా, సుప్రీం స్టార్‌గా, మెగాస్టార్‌గా ఎదిగారు. నాలుగున్నర దశాబ్దాల కెరీర్‌లో 156 సినిమాలు చేశారు. ఎన్నో విజయాలు అందుకున్నారు. `ఖైదీ` తర్వాత ఆయన కెరీర్ పరుగులు పెట్టిందని చెప్పొచ్చు. దాదాపు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేశారు. తిరుగులేని మెగాస్టార్‌గా రాణించారు. ఇప్పటికీ రాణిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు.
చిరంజీవి 156 సినిమాల్లో అనేక రకాల పాత్రలు పోషించారు. హీరోగా, విలన్‌గా, సెకండ్ లీడ్‌గా చేశారు. అదే సమయలో పోలీసుగా, గ్యాంగ్ స్టర్‌గా, కూలీగా, రిక్షావోడిగా, ఆటో డ్రైవర్ గా, బిలియనీర్‌గా, డాక్టర్‌గా, రైతుగా, పొలిటీషియన్‌గా, చివరికి చెప్పులు కుట్టేవాడిగానూ కనిపించారు. ఇలా విభిన్నమైన పాత్రలు, విభిన్నమైన గెటప్స్ తో మెప్పించారు. ఇప్పటికీ డిఫరెంట్ లుక్స్ తోనూ ఆకట్టుకుంటూనే ఉన్నారు. మరి ఇన్ని రోల్స్ చేసిన చిరంజీవికి ఇష్టమైన లుక్ ఏంటో తెలుసా? తన ఫేవరేట్ రోల్ ఏంటో రివీల్ చేశారు మెగాస్టార్.
చిరంజీవి ఎన్నో సినిమాలు చేశారు. అవన్నీ ఓ ఎత్తైతే, `కొదమసింహం` మరో ఎత్తు. ఎందుకంటే చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ మూవీ ఇదే. అంతకు ముందు తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ `మోసగాళ్లకి మోసగాడు` అనే మూవీ చేశారు. సంచలనాలు సృష్టించారు. ఆ తర్వాత చిరంజీవి ఆ సాహసం చేశారు. దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపించడంతో చిరు కాదనలేకపోయారు. స్వతహాగా తనకు కౌబాయ్ మూవీస్ అంటే ఇష్టమట. అలాంటి సినిమాలు ఎక్కువగా చూసేవాడట. కానీ తాను ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదట.
దర్శకుడు మురళీమోహన రావు, కైకాల నాగేశ్వరరావు వచ్చి ఈకథ చెప్పినప్పుడు ఓకే అన్నారు. మేకింగ్ పరంగా రిస్క్ అయినా చేశారు. ఆ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. మొదటి వారంలో అన్ని ఏరియాల్లో రికార్డు వసూళ్లని రాబట్టింది. ఓవరాల్‌గా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఇదిలా ఉంటే ఈ మూవీలోని కౌబాయ్ లుక్ తన ఫేవరేట్ లుక్ అని తెలిపారు చిరంజీవి. `కొదమసింహం` ఈ శుక్రవారం(నవంబర్ 21)న రీ రిలీజ్ సందర్భంగా ఆయన ఈ సినిమాకి సంబంధించిన మెమొరీస్‌ని పంచుకున్నారు.
అందులో భాగంగా కౌబాయ్ లుక్ తనకు ఎంతో ఇష్టమైనది అని, తన ఇష్టాన్ని తెలుసుకుని నిర్మాతలు ప్రత్యేకంగా ఫ్రేమ్ డిజైన్ చేసి తనకు గిఫ్ట్ గా ఇచ్చారని, ఆ ఫ్రేమ్‌ని తన ఇంట్లో స్పెషల్ ప్లేస్‌లో పెట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆ ఫ్రేమ్‌ని చూపించారు చిరంజీవి. తనకే కాదు, తనకంటే ఎక్కువగా రామ్ చరణ్‌కి ఈ మూవీ చాలా ఇష్టమని, ఈ సినిమా చూస్తూనే భోజనం చేసేవాడని తెలిపారు. ఇందులో తాను గుర్రపుస్వారీ చేసిన నేపథ్యంలో అప్పట్నుంచి హార్స్ రైడింగ్ చరణ్‌కి ఇష్టంగా మారిందని, ఇప్పుడు హ్యాబీ అయ్యిందన్నారు.
ఇక `కొదమసింహం` చిత్రంలో మొదటిసారి గెడ్డంతో కనిపించారు చిరంజీవి. అప్పటి వరకు క్లీన్ షేవ్‌తోనే మూవీ చేశారు. గ్లామర్‌గా కనిపించాలంటే క్లీన్ షేవ్ ఉండాలని అది ఫాలో అయ్యారు. కానీ మొదటసారి కొద్దిపాటి గడ్డంతో చేసిన తొలి చిత్రం ఇదే అని చిరంజీవి పేర్కొన్నారు. శుక్రవారం రీ రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చిరంజీవి `మన శంకరవరప్రసాద్ గారు` చిత్రంలో నటిస్తున్నారు. ఇది సంక్రాంతికి విడుదల కాబోతుంది. మరోవైపు `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది. అలాగే బాబీ దర్శకత్వంలో ఓ మూవీ, శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నారు చిరంజీవి.