బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదకొండో వారం ఎలిమినేషన్‌.. హౌజ్‌ నుంచి అసలైన ఫైర్‌ బ్రాండ్‌ ఔట్‌

Published : Nov 22, 2025, 01:03 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదకొండో వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ముందు నుంచి ఊహించినట్టు ఈ వారం క్రేజీ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అయ్యారు. 

PREV
14
11వ వారం బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఈ వారం(11వ వారం) నామినేషన్‌లో కళ్యాణ్‌, భరణి, ఇమ్మాన్యుయెల్‌, డీమాన్‌ పవన్‌, సంజనా, దివ్య ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది సస్పెన్స్ గా మారింది. కళ్యాణ్‌, ఇమ్మాన్యుయెల్‌, భరణి ఓటింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నారు. డీమాన్‌ పవన్‌, సంజనా, దివ్య ఓటింగ్‌లో బాటమ్‌లో ఉన్నారు. వీరిలోనూ సంజనా, దివ్య మరీ లీస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్‌ పక్కా అని అనుకున్నారు. మొత్తంగా అదే జరిగింది. ఈ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ అయ్యారనేది క్లారిటీ వచ్చింది.

24
దివ్య ఎలిమినేట్‌

సోషల్‌ మీడియా నుంచి తెలుస్తోన్న సమాచారం మేరకు, మనకు ఉన్న సోర్స్ మేరకు ఈ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి దివ్య ఎలిమినేట్‌ అయినట్టు సమాచారం. ఆమె ఎలిమినేషన్‌ కన్ఫమ్‌ అయినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు బిగ్‌ బాస్‌ ఫాలోవర్స్. అయితే ఓటింగ్‌ ప్రకారం కూడా లీస్ట్ లో దివ్యనే ఉన్నారు. ఆమెకి కనీసం పది శాతం ఓట్లు కూడా రాలేదు. గత వారంలోనూ ఆమె లీస్ట్ లోనే ఉన్నారు. కానీ నిఖిల్‌, గౌరవ్‌లను ఎలిమినేట్‌ చేయడంతో దివ్య బతికిపోయింది. ఈ వారం మాత్రం ఎలిమినేషన్‌ని తప్పించుకోలేకపోయింది.

34
కామన్‌మేన్‌ కేటగిరిలో హౌజ్‌లోకి వచ్చిన దివ్య

ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడే దివ్య ఎలిమినేషన్‌కి సంబంధించిన షూటింగ్‌ జరిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దివ్య బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ ఓపెనింగ్‌లో రాలేదు. మిడ్‌ వీక్‌లో ఎంట్రీ ఇచ్చింది. సంజనా ఎలిమినేట్‌ కాగా, దివ్య హౌజ్‌లోకి వచ్చింది. ఆమె కామన్‌మేన్‌ కేటగిరిలో హౌజ్‌లోకి రావడం విశేషం. ఈ కేటగిరిలో వచ్చిన శ్రీజ, ప్రియా, హరిత హరీష్‌, మర్యాద మనీష్‌లు ఎలిమినేట్‌ అయ్యారు. డీమాన్‌ పవన్‌, కళ్యాణ్‌తోపాటు దివ్య కూడా ఇన్నాళ్లు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సర్వైజ్‌ అయ్యారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు దివ్య హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. 11వ వారం ఆమె ఎలిమినేట్‌ కావడం గమనార్హం.

44
అసలైన ఫైర్‌ బ్రాండ్‌గా నిలిచిన దివ్య

దివ్య బిగ్‌ బాస్‌ హౌజ్‌లో చాలా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ గా ఉన్నారు. టాస్క్ ల్లోనూ చాలా బాగా ఆడుతున్నారు. ఏదైనా వాదించే విషయంలోనూ బలంగా తన వాదన వినిపిస్తోంది. అసలైన ఫైర్‌ బ్రాండ్‌గా నిలిచింది. అయితే ప్రతి దానికి వాదిస్తుందనే కామెంట్‌ ఉంది. మరోవైపు భరణితో రిలేషన్‌కి సంబంధించి విమర్శలు ఎదుర్కొంటుంది. భరణి కోసం ఆమె, ఆమె కోసం భరణి గేమ్‌ ఆడుతుందనే కామెంట్లని ఫేస్‌ చేసింది. అదే సమయంలో గత రెండు మూడు వారాలుగా ఆమెపై నెగటివిటీ పెరిగింది. అది క్రమంగా ఇప్పుడు ఎలిమినేషన్‌కి దారితీసింది. అయితే ఇప్పుడు హౌజ్‌లో ఉన్న వాళ్లంతా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు. ఎవరు ఎలిమినేట్‌ అయినా ఆశ్చర్యం లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories