నాగచైతన్య మతిపోయే లగ్జరీ కార్స్, స్పోర్ట్స్ బైక్ కలెక్షన్స్.. రేట్లు వింటే మైండ్‌ బ్లాక్‌

First Published Jun 10, 2021, 8:29 AM IST

అక్కినేని హీరో నాగచైతన్యకి ఆస్తులకంటే బైకులు, కార్లే ఎక్కువ ఇష్టమట. స్పోర్ట్స్ కార్లు, బైకులు బాగా ఇష్టపడతారట. అంతేకాదు వాటికి సంబంధించిన భారీ కలెక్షనే ఉంది చైతూ వద్ద. వాటి రేట్‌ తెలిస్తే మాత్రం మతిపోవడం ఖాయం. 

నాగచైతన్య.. అక్కినేని నట వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా రాణిస్తున్నాడు. `మనం`, `ప్రేమమ్‌`, `మజిలి` చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు `లవ్‌ స్టోరి`తో మరోసారి మాయ చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
undefined
ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ నేపథ్యంలో తనకిష్టమైన వ్యాపకాలపై దృష్టి పెట్టాడు చైతూ. తనకి స్పోర్ట్స్ కార్లు, బైకులంటే ఇష్టమట. కొత్త మార్కెట్‌లో ఏ కొత్త బైక్‌ వచ్చినా అది తన షెడ్‌లో ఉండాల్సిందేనట. అంతేకాదు స్పోర్ట్స్ కార్ల విషయంలోనూ అదే ఇంట్రెస్ట్. అందుకే ఆయన వద్ద కలెక్షన్‌ బాగానే ఉంది.
undefined
కార్ల విషయానికి వస్తే, ఆయన వద్ద ఫెరారి ఎఫ్‌430 కారు ఉంది. టైమ్‌ దొరికితే ఈ కారులో షికారుకెళ్తుంటాడు చైతూ. దీని విలువ 1.71కోట్లు అట. అంటే రోల్స్ రాయ్స్ రేంజ్‌ రేట్‌ అని చెప్పొచ్చు.
undefined
అలాగే మెర్సిడేజ్‌ బెజ్‌ జీ -క్లాస్‌ జీ 63 కారు కూడా ఉంది. దీని విలువ కోటి రూపాయలు ఉంటుంది. చాలా మంది టాలీవుడ్‌, బాలీవుడ్‌ స్టార్స్ ఈ కారుని వాడుతుంటారు. దీన్ని చైతూ అఫీషియల్‌గా యూజ్‌ చేస్తుంటారు.
undefined
బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ కారు కూడా ఉంది. దీని వ్యాల్యూ కోటికి పైగానే ఉంటుంది. ఇది రెగ్యూలర్‌ ఫంక్షన్లు, ఈవెంట్లకి వాడుతుంటారు.
undefined
ఈ రెండింటితోపాటు ఎమ్‌వీ ఆగస్టా ఎఫ్‌ 4 అనే మరో కారు ఉంది. దీని విలువ సుమారు 35 లక్షల వరకు ఉంటుందట. చైతూ ఎక్కువగా ఈ కారులోనే షికారు కెళ్తారట. స్పోర్ట్స్ కారుగా దీన్ని తరచూ ఉపయోగిస్తుంటాడట.
undefined
బైకుల విషయానికి వస్తే.. చైతూ వద్ద బీఎండబ్ల్యూ9టీ గల ఖరీదైన బైకు ఉంది. ఇది 2014లో లాంచ్‌ కాగా, వెంటనే తన సొంతం చేసుకున్నాడు చైతూ. దీని విలువ ఏకంగా 19 లక్షలు అట.
undefined
దీని ప్రత్యేకత ఏంటంటే తన భార్య సమంతతో చైతూ ఈ బైక్‌ పైనే ఎక్కువగా షికారుకి వెళ్తుంటారట. సామ్‌కి కూడా బాగా నచ్చిన బైక్‌ అని టాక్‌.
undefined
దీంతోపాటు ట్రింఫ్‌ థ్రాక్స్టన్‌ ఆర్‌ బైక్‌ ఉంది. ఇది రేసర్‌ బైక్‌. రైసింగ్‌ బైక్‌ అంటే చైతూకి అమితమైన ప్రేమ. దీన్ని కూడా ఎక్కువగా వాడుతుంటారట. దీని విలువ రూ. 13 లక్షలు అని టాక్‌.
undefined
వీటితోపాటు లక్షకు పైగా చేసే ఓ యమహా వైజెడ్‌ ఎఫ్‌ ఆర్‌ 1 స్పోర్ట్స్ బైక్‌, అలాగే హోండా స్పోర్ట్స్ బైక్‌ వంటివి చైతూ గ్యారేజీలో ఉన్నాయి. వీటితోపాటు కాలనుగుణంగా కొన్ని మార్చేశాడు చైతూ.
undefined
ప్రస్తుతం చైతూ `లవ్‌ స్టోరీ`తోపాటు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇటీవల ఫారెన్‌లో షూటింగ్‌ జరుపుకుని వచ్చింది. త్వరలో మళ్లీ షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌.
undefined
click me!