Naga Chaitanya: నాగ చైతన్యతో నటించి కనిపించకుండా పోయిన ఆరుగురు హీరోయిన్లు.. డేంజర్ లో మరో ముగ్గురి కెరీర్

Published : Jan 17, 2026, 12:14 PM IST

అక్కినేని నాగ చైతన్యతో నటించి సినిమాలకు దూరమైన హీరోయిన్లు కొందరు ఉన్నారు. కొందరు టాలీవుడ్ కి దూరమై ఇతర భాషల్లో సినిమాల్లోకి చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
18
నాగ చైతన్యతో నటించిన హీరోయిన్లు 

అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్నారు. చైతు నటించిన చివరి చిత్రం తండేల్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు చైతు వృషకర్మ అనే మిస్టీరియస్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నాడు. నాగ చైతన్యతో ఇప్పటి వరకు సమంత నుంచి సాయి పల్లవి వరకు చాలా మంది హీరోయిన్లు నటించారు. వారిలో కొందరు హీరోయిన్ల కెరీర్ ముగిసిపోయింది. కొందరు సినిమాలకు దూరమయ్యారు. మరి కొందరి కెరీర్ డేంజర్ లో ఉంది. ఆ హీరోయిన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. 

28
కార్తీక

నాగ చైతన్య తొలి చిత్రం జోష్ లో కార్తీక హీరోయిన్ గా నటించింది. ఆమె ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్ రాధ కుమార్తె. కార్తీక జోష్ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ సక్సెస్ రాలేదు. దీనితో ఆమె సినిమాలకు దూరమైంది. 

38
అమలాపాల్

బెజవాడ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. అమలాపాల్ కెరీర్ లో కొన్ని విజయాలు ఉన్నాయి. ఆమె సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ సినిమాల్లో ఆమె నటించి చాలా కాలం అవుతోంది. ఇతర భాషల్లో అప్పుడప్పుడూ మెరుస్తోంది.

48
కృతి సనన్

మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ చైతన్యతో దోచేయ్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం కృతి సనన్ తెలుగులో నటించడం లేదు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. 

58
మంజిమ మోహన్

ఈ మలయాళీ హీరోయిన్ చైతుతో సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెకి పెద్దగా టాలీవుడ్ లో ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం ఆమె మలయాళీ సినిమాలు చేస్తోంది.

68
రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. కానీ ఆమె ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయడం లేదు. రకుల్ ప్రీత్ సింగ్, నాగ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించారు. 

78
అను ఇమ్మాన్యుయేల్

అను ఇమ్మాన్యుయేల్ చైతుతో శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అను ఇమ్మాన్యుయేల్ కి తెలుగులో సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం ఆమెకి ఆఫర్స్ కూడా రావడం లేదు.

88
డేంజర్ లో మరో ముగ్గురు

నాగ చైతన్యతో నటించి కెరీర్ డేంజర్ లో ఉన్న మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారు. నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంలో నటించింది. నిధి చివరిగా హరహర వీరమల్లు, రాజాసాబ్ లాంటి భారీ చిత్రాల్లో నటించింది. అవి ఫ్లాప్ అయ్యాయి. అదే విధంగా రాశి ఖన్నా, కృతి శెట్టి కూడా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటూ కెరీర్ పరంగా డేంజర్ లో ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories