Thanuja: సీరియల్స్ కి తనూజ గుడ్‌ బై.. ఇకపై ఆమె టార్గెట్‌ ఇదే.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 కి వెళ్లిన కారణం ఇదేనా

Published : Jan 17, 2026, 08:53 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షో ద్వారా తనూజ మంచి పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే దాన్ని ఇప్పుడు సినిమాల్లో వాడబోతుందట. తన టార్గెట్‌ కూడా ఇదే అని తెలుస్తోంది. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోతో తనూజకి విపరీతమైన క్రేజ్‌

తనూజ పుట్టస్వామి బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోని అల్లాడించిన కంటెస్టెంట్‌. సెంటిమెంట్‌, ఎమోషన్స్‌, రిలేషన్స్, సీక్రెట్‌ లవ్‌ ట్రాక్‌, కామెడీ ఇలా తనలోనూ అన్ని యాంగిల్స్ ని ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. సైలైంట్‌ గా వచ్చి టాప్‌ కంటెస్టెంట్‌గా నిలిచింది. ఏకంగా టైటిల్‌ గెలుచుకునేందుకు చివరి మెట్టు వరకు వెళ్లింది. కానీ రన్నరప్‌గానే మిగిలిపోయింది. అడుగు దూరంలో ట్రోఫీని కోల్పోయింది. కాకపోతే మంచిగుర్తింపు, పాపులారిటీ, క్రేజ్‌ని సొంతం చేసుకుంది తనూజ. బిగ్‌బాస్‌ విన్నర్‌ రేంజ్‌ ఆమె క్రేజ్‌ని సొంతం చేసుకోవడం విశేషం.

25
తనూజ బిగ్‌ బాస్‌ షోకి రావడం వెనుక ప్లాన్

తనూజ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కన్నడ, తమిళం, తెలుగులో చాలానే సీరియల్స్ చేసింది. కానీ తెలుగులో చేసిన `ముద్దమందారం` సీరియల్ తో‌ ఆమెకి విశేషమైన క్రేజ్‌ వచ్చింది. ఈ సీరియల్‌ ఆమెని బుల్లితెర స్టార్‌ ని చేసింది. ఇదే ఆమెని బిగ్‌ బాస్‌ షోకి తీసుకొచ్చేలా చేసింది. బిగ్‌ బాస్‌ షో ఆమెని మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. అయితే తనూజ బిగ్‌ బాస్‌కి ఎందుకు వచ్చింది? దాని వెనకాల ఆమె ప్లాన్‌ ఏంటి? నెక్ట్స్ ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె స్కెచ్‌ ఏంటో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

35
సీరియల్స్ కి తనూజ గుడ్‌ బై

తనూజ ఇకపై సీరియల్స్ కి గుడ్‌ బై చెప్పబోతుందట. మున్ముందు సీరియల్స్ చేయబోననే విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. బిగ్ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌ ఫినాలే తర్వాత ఆమె శివాజీతో ఇంటర్వ్యూలో పాల్గొంది. బిగ్‌ బాస్‌ బజ్‌లో ఇకపై సీరియల్స్ చేయనన్నావట అని శివాజీ ప్రశ్నించాడు. దీనికి తనూజ స్పందిస్తూ, తాను ఇప్పటికే ఓ సినిమా చేశానని తెలిపింది. అది విడుదలకు రెడీగా ఉందట. దీంతోపాటు ఓ ఓటీటీ సిరీస్‌ కి కూడా ఓకే చెప్పిందట. అది గత నవంబర్‌లోనే స్టార్ట్ కావాల్సింది. తాను బిగ్ బాస్‌ షోకి రావడంతో ఆగిపోయినట్టు తెలిపింది. ఇది త్వరలోనే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందట.

45
తనూజ నెక్ట్స్ టార్గెట్‌ ఇదే

తనూజ ఇకపై బిగ్‌ స్క్రీన్‌ ని టార్గెట్‌ చేసిందట. సినిమాల్లో రాణించాలని ప్లాన్‌ చేస్తున్నట్టుగా ఇందులో వెల్లడించింది. అందులో భాగంగానే ఇకపై సీరియల్స్ చేయబోననే విషయం చెప్పకనే చెప్పింది. తన నెక్ట్స్ ఫోకస్‌ సినిమాలు అనే విషయాన్ని ఆమె చెప్పింది. ఇప్పుడే కాదు గతంలోనూ సినిమాలు చేసింది తనూజ. `లీగల్లీ వీర్‌` అనే మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. కోర్ట్ రూమ్‌ డ్రామాగా ఇది రూపొందింది. రెండేళ్ల క్రితమే విడుదలయ్యింది. కానీ ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిగ్‌ బాస్‌ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో ఆమె మరింతగా సినిమాలపై ఫోకస్‌ చేయబోతుందట.

55
సినిమాల్లో తనూజ సక్సెస్‌ అవుతుందా?

తనూజ బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి వచ్చిన ఉద్దేశ్యం కూడా ఇదే అని సమాచారం. ఈ విషయంలో తను కూడా సక్సెస్‌ అయ్యిందని చెప్పొచ్చు. తనకు రావాల్సిన క్రేజ్‌ వచ్చింది. అంతేకాదు అన్ని రకాల ఎమోషన్స్ ని పలికించగలనని నిరూపించుకుంది. డ్రామా క్రియేట్‌ చేయగలిగింది. ఇది ఆమెకి సినిమాల్లో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అయితే బిగ్‌ బాస్‌ షో కి వచ్చిన ఆర్టిస్ట్ లకు స్టార్టింగ్‌ లో వరుసగా ఆఫర్లు వస్తాయి. కానీ ఆ తర్వాతనే డౌన్‌ అయిపోతున్నారు. లాంగ్‌ రన్‌ ఉండటం లేదు. మరి దాన్ని తనూజ బ్రేక్‌ చేసి సినిమాల్లో సక్సెస్‌ అవుతుందా అనేది చూడాలి. మొత్తానికి ఇకపై తనూజ సీరియల్స్ చేయబోదనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఇది బుల్లితెర అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories