Samantha రికార్డుని బ్రేక్‌ చేసిన తమన్నా.. టాప్‌లో సాయిపల్లవి.. అత్యధిక వ్యూస్‌ సాధించిన టాప్‌ 5 సాంగ్స్

Published : Jan 17, 2026, 11:34 AM IST

తమన్నా స్పెషల్‌ సాంగ్స్ తో ఇప్పుడు దుమ్ములేపుతుంది. తాజాగా ఆమె నర్తించిన `ఆజ్‌ కీ రాత్‌` అనే పాట అత్యధిక వ్యూస్‌ సాధించిన పాటల జాబితాలో చేరింది. తమన్నా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. 

PREV
15
సమంత రికార్డుని బ్రేక్‌ చేసిన తమన్నా

సినిమా సాంగ్స్ ఎక్కువ వ్యూస్‌ రావడం కామనే. అయితే అది పది మిలియన్స్ అనేది వెరీ కామన్‌. యాభై మిలియన్స్ వస్తే ఓకే అని చెప్పొచ్చు. అదే వంద మిలియన్స్ అంటే కచ్చితంగా మాట్లాడుకోవాల్సింది. అలాంటిది ఒక బిలియన్‌ వ్యూస్‌ అంటే. అది కచ్చితంగా అరుదైన రికార్డు. ఇప్పుడు తమన్నా ఆ రికార్డుని క్రియేట్‌ చేసింది. సౌత్‌లో సమంత రికార్డుని బ్రేక్‌ చేసింది. కాకపోతే సాయి పల్లవికి చాలా దూరంలో ఉంది.

25
యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న `ఆజ్‌ కీ రాత్‌` పాట

తమన్నా ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా స్పెషల్‌ సాంగ్స్ లోనే కనిపిస్తోంది. ఆమె రెండేళ్ల క్రితం `స్ట్రీ 2` అనే చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. `ఆజ్‌ కీ రాత్‌` అనే పాటలో ఆమె మెరిసింది. శ్రద్ధా కపూర్‌ మెయిన్‌ లీడ్‌గా చేసింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. అయితే ఇందులో `ఆజ్‌ కీ రాత్‌` బాగా ఆదరణ పొందింది. సినిమా ఆడియెన్స్ కి చేరువ కావడంలో ఈ పాట పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. ఇందులో తమన్నా స్టెప్పులు అందరిని కట్టిపడేశాయి. ఆమె గ్లామర్‌, డాన్స్ మూమెంట్స్ కుర్రాళ్లకి మతిపోయేలా చేశాయి. దీంతో ఈ పాటని తెగచూస్తున్నారు.

35
వంద కోట్ల వ్యూస్‌ని దాటేసిన తమన్నా పాట

ఇప్పుడీ పాట సరికొత్త రికార్డుని సృష్టించింది. అత్యధిక వ్యూస్‌ సాధించిన పాటగా నిలిచింది. తాజాగా ఇది వంద కోట్ల వ్యూస్‌ని దాటింది. తమన్నా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 1 బిలియన్‌ వ్యూస్‌ పొందినట్టు చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. మీప్రేమకి ధన్యవాదాలు అని వెల్లడించింది తమన్నా. దీంతో ఇది వైరల్‌ అయ్యింది. ఈపాట ఇప్పుడు మరోసారి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

45
సమంత రికార్డ్ బ్రేక్‌, సాయిపల్లవికి చాలా దూరంలో

అంతేకాదు తమన్నా ఇప్పుడు సమంత రికార్డుని బ్రేక్‌ చేసింది. సమంత చేసిన స్పెషల్‌ సాంగ్‌ `ఊ అంటా వా మావ`(పుష్ప) ఇప్పటి వరకు 500 మిలియన్స్ వ్యూస్‌ని దాటింది. అంటే యాభై కోట్లమంది దీన్ని వీక్షించారు. సౌత్‌ హీరోయిన్లలో సమంత పేరుతో ఉన్న రికార్డుని తమన్నా బ్రేక్‌ చేయడం విశేషం. అయితే తమన్నా కంటే ముందు సాయి పల్లవి ఉంది. ఆమె `మారి 2`లో చేసిన `రౌడీ బేబీ` సాంగ్‌ అంతకంటే ఎక్కువ వ్యూస్‌ సాధించిన పాటగా నిలిచింది. ఈ పాటకి 1.7 బిలియన్స్ వ్యూస్‌ వచ్చాయి. అంటే 170కోట్ల వ్యూస్‌ ని సాధించింది. అయితే ఇది ఏడేళ్ల క్రితం విడుదల కావడం గమనార్హం.

55
టాప్‌ 5 సాంగ్స్ లో సాయి పల్లవి రౌడీ బేబీ

ఇక యూట్యూబ్‌ వీడియోస్ లో `శ్రీ హనుమాన్‌ చాలిసా` టాప్‌లో ఉంది. దీనికి ఐదు బిలియన్స్(500కోట్ల వ్యూస్‌) రావడం విశేషం. `లెహెంగా జాస్‌ మనక్‌` అనే ఒరిజినల్‌ సాంగ్‌ 1.8 బిలియన్‌ వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. `52 గాజ్‌ కా దమన్‌` అనే పాట 1.73బిలియన్‌ వ్యూస్‌తో మూడో స్థానంలో ఉంది. `జరూరీ థా` అనే పాట 1.71 వ్యూస్‌తో నాల్గో స్థానంలో, `రౌడీ బేబీ(మారి 2) 1.71వ్యూస్‌లో ఐదో స్థానంలో నిలిచింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories