Pawan Kalyan Rare Thing: పవన్‌ హీరో రాకముందు కలిసే ఒకే ఒక్క స్టార్‌ ఎవరో తెలుసా? వాళ్లింట్లో ఏం చేసేవారంటే?

Published : Feb 01, 2025, 10:40 AM IST

Pawan Kalyan Rare Thing: పవన్‌ కళ్యాణ్‌ కి సిగ్గు, మొహమాటం ఎక్కువ. కానీ ఆయన సినిమాల్లోకి రాకముందు మాత్రం ఒకే ఒక్క స్టార్‌ హీరోని కలిసేవారు. ఆయన ఇంటికీ వెళ్లేవారు.   

PREV
16
Pawan Kalyan Rare Thing: పవన్‌  హీరో రాకముందు కలిసే ఒకే ఒక్క స్టార్‌ ఎవరో తెలుసా? వాళ్లింట్లో ఏం చేసేవారంటే?

Pawan Kalyan Unknown Thing: పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో తిరుగులేని పవర్‌ స్టార్‌గా ఎదిగారు. అదే సమయంలో రాజకీయాల్లోనూ టాప్‌ లీడర్‌గా ఎదిగారు. ఇలా రెండింటిలోనూ టాప్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.

అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన ఒప్పుకున్న సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. సమయం కుదిరినప్పుడు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన `హరిహర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. 
 

26
Pawan Kalyan

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర, ఎవరికీ తెలియని విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆయన చిన్నప్పుడు చేసిన ఓ పని బయటకు వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ కి మొహమాటం, సిగ్గు ఎక్కువ.  

ఎవరితోనూ ఈజీగా మూవ్‌ అవ్వరు, ఇంట్రోవర్ట్ గా ఉంటారని అంటారు. ఆయన కూడా ఒప్పుకుంటారు. అయితే కొంత మంది వద్ద మాత్రం ఆయన ఓపెన్‌ అవుతుంటారు. తన ఆలోచనలు, భావాలు దగ్గరగా ఉన్న వారితో ఆయన క్లోజ్‌గా మూవ్‌ అవుతుంటారు. 

36
pawan kalyan, venkatesh

అలా పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోకి రాకముందు ఓ స్టార్‌ హీరోతో క్లోజ్‌గా ఉండేవారట. ఆయన ఇంటికి కూడా వెళ్లేవారట. ఆ స్టార్‌ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్‌. వెంకీ ఎక్కువగా ఆథ్యాత్మిక భావనతో ఉంటారు. ఆయా విషయాలను ఇష్టపడుతుంటారు. అలాంటి పుస్తకాలు చదువుతారు.

పవన్‌ కూడా అదే భావనతో ఉంటారట. అందుకే ఆయనంటే ఇష్టమని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌. తామిద్దరం కలిసినప్పుడు ఎక్కువగా ఆథ్యాత్మిక విషయాలను చర్చించుకుంటామని తెలిపారు. 

46

సినిమాల్లోకి రాకముందు తాను కలిసే ఒకే ఒక్క హీరో వెంకటేష్‌ అని, ఆయన ఇంటికి రెగ్యూలర్‌గా వెళ్లేవాడని అని చెప్పారు. అయితే అక్కడ పవన్‌ సీడీలను కలెక్ట్ చేసేవాడట. సినిమాలకు సంబంధించిన సీడీలు, డీవీడీలను కలెక్ట్ చేసుకునేవాడట.

వారింట్లో అవి ఎక్కువగా ఉండేవని తెలిపారు పవన్‌. అప్పట్నుంచి తాము క్లోజ్‌ అని, తనకు వెంకటేష్‌ బ్రదర్‌లాంటివారు అని చెప్పారు పవన్‌. `గోపాల గోపాల` ఆడియో ఈవెంట్‌లో ఈ విషయం వెల్లడించారు. 
 

56

పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌ కలిసి `గోపాల గోపాల` అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. దీనికి కిశోర్‌ కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహించారు. శ్రియా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మిథున్‌ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.

ఇందులో పవన్‌ కృష్ణుడిగా కనిపిస్తాడు. వెంకీ దేవుడంటే నమ్మని వ్యక్తిగా కనిపిస్తారు. ఓ కేసు విషయంలో వెంకటేష్‌కి గోపాలుడిగా పవన్‌ హెల్ప్ చేసి, ఆయనకు దేవుడిని నమ్మేలా చేయడమే ఈ మూవీ కథ. 2015లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌గా ఆడింది. 

66

వెంకటేష్‌ ఇటీవలే సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. దీంతో ఆడియెన్స్ విశేషంగా ఆదరిస్తున్నారు.

అలా ఈ మూవీ ఇప్పుడు ఏకంగా రూ.300కోట్ల కలెక్ట్ చేయడం విశేషం. ఇంతటి కలెక్షన్లు సాధించిన రీజనల్‌ తెలుగు మూవీగా `సంక్రాంతికి వస్తున్నాం` రికార్డు క్రియేట్‌ చేసింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటించారు. 

read more: Top 25 Pan-Indian Superstars List: మహేష్‌ కి దారుణమైన రేటింగ్‌, బన్నీ, ప్రభాస్‌, తారక్‌, చరణ్‌లు ఎక్కడంటే?

also read: Sankranthiki Vasthunam Movie: వెంకటేష్‌ సంచలనం, తెలుగు సినిమా చరిత్రలో కొత్త రికార్డ్.. సీనియర్లకి ఝలక్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories