శృతి హాసన్‌ స్థానంలో మృణాల్‌ ఠాకూర్‌, గన్‌ పట్టుకుని ఊర మాస్‌ లుక్‌, సినిమా ఏంటో తెలుసా?

First Published | Dec 17, 2024, 12:42 PM IST

స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో క్రేజీ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ని తీసుకున్నారు. 
 

శృతి హాసన్‌ మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌. ఆమె చేసే ప్రతి సినిమా సక్సెస్‌ అవ్వాల్సిందే. అలాంటి సినిమాలే చేస్తుంది. అది కమర్షియల్‌ మూవీనా? మరో సినిమా అనేది చూడదు, తనకు పాత్ర నచ్చితే, కథలో విషయం ఉంటే చేస్తుంది. గతేడాది బ్యాక్‌ టూ బాక్‌ మూడు హిట్లతో హ్యాట్రిక్స్ సక్సెస్‌ కొట్టింది శృతి హాసన్‌.

`వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి`, `సలార్‌` సినిమాలతో విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. `ది ఐ` అనే ఇంగ్లీష్‌ మూవీ చేసింది. అలాగే `హాయ్‌ నాన్న`లో గెస్ట్ గానూ మెరిసింది. ఇలా అన్నీ హిట్లే పడ్డాయి.

read more: సమంతకి స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఫామ్‌ హౌజ్‌ గిఫ్ట్.. కొడుకు కోసం నిర్మాత అంతటి సాహసం ?
 

ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. తన అభిమానులను డిజప్పాయింట్‌ చేసిందని చెప్పొచ్చు. కానీ వచ్చే ఏడాది మాత్రం మూడు సినిమాలతో రాబోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలున్నాయి. వీటితో బ్యాక్‌ టూ బ్యాక్‌ అలరించబోతుంది శృతి.

అయితే ఇటీవల ఓ మూవీని వదులుకుంది శృతి హాసన్‌. షూటింగ్‌ జరుపుకున్న మూవీ నుంచి తప్పుకుంది. అది అడవి శేషు హీరోగా రూపొందుతున్న `డెకాయిట్‌` చిత్రం కావడం గమనార్హం. 

Tap to resize

అడవి శేషు, శృతి హాసన్‌ జంటగా షనీల్‌ డియో దర్శకత్వంలో `డెకాయిట్‌` రూపొందించాల్సి ఉంది. దీనికి `ఒక ప్రేమ కథ` అనేది ట్యాగ్‌ లైన్‌. ఎమోషనల్ యాక్షన్‌ లవ్‌ స్టోరీగా దీన్ని తెరకెక్కించాలని భావించారు. ఈ ఇద్దరి మీద టీజర్‌ని కూడా విడుదల చేశారు.

ప్రేమ, విడిపోవడం వెనుక సంఘర్షణని తెలియజేశారు. గ్లింప్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఉన్నట్టుంది సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకుంది. క్రియేటివ్‌ డిఫరెంట్స్ అని, తన పాత్ర చిత్రీకరణ నచ్చక శృతి హాసన్‌ తప్పుకున్నట్టు సమాచారం. 

also read: ఆ పని చేయలేక కాలు విరగొట్టుకున్న జూ ఎన్టీఆర్‌, ఇప్పటికీ అదే మొండిపట్టు
 

ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ వచ్చింది. ఓ క్రేజీ హీరోయిన్‌ ని తీసుకోవడం విశేషం. `సీతారామం`, `హాయ్‌ నాన్న`, `ఫ్యామిలీ స్టార్` చిత్రాలతో ఆకట్టుకున్న మృణాల్‌ ఠాకూర్‌ని తీసుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అడవిశేషు, మృణాల్‌ కలిసి ఉన్న కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. శృతి స్థానంలో మృణాల్‌ని తీసుకున్నట్టుగా కన్ఫమ్‌ చేశారు.

అయితే ఇందులో మృణాల్‌ లుక్‌ అదిరిపోయింది. ఆమె కారు నడుపుతూ కనిపిస్తుంది. చేతిలో గన్‌ ఉంది, మాస్‌ లుక్‌లో ఉంది మృణాల్‌. ఇందులో ఆమె యాక్షన్‌ చేయబోతుందనే విషయం అర్థమవుతుంది. చూడ్డానికి పవర్‌ఫుల్‌ రోల్‌ అని తెలుస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 

ఎస్‌ఎస్‌ క్రియేషన్స్, సునీల్‌ నారంగ్‌ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై సుప్రియా యార్లగడ్డ ఈ మూవీని నిర్మిస్తుంది. నేడు అడవిశేషు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. అతనికి ద్రోహం చేసిన వ్యక్తిని మేము పరిచయం చేస్తున్నాం, అతని ప్రేమ, అతని శత్రువు` అనే కొటేషన్‌తో ఈ పోస్టర్‌ని విడుదల చేయగా, ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ మూవీతో మృణాల్‌ కమ్ బ్యాక్‌ కాబోతుందని చెప్పొచ్చు. ఈ ఏడాది ఆమె `ఫ్యామిలీ స్టార్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆదరణ పొందలేదు. దీంతో తెలుగులో ఆఫర్లు తగ్గాయి, హిందీలో మాత్రం నాలుగు సినిమాలు చేస్తుంది మృణాల్‌. 
 

మరోవైపు శృతి హాసన్‌ చేతిలో ఇప్పుడు రజనీకాంత్‌ `కూలీ` సినిమా ఉంది. ఇందులో నాగార్జున, అమీర్‌ ఖాన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీంతోపాటు `సలార్‌ 2` చేయాల్సి ఉంది. ఇది వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే `చెన్నై స్టోరీ` అనే మరో సినిమాలో నటిస్తుంది శృతి హాసన్. కొత్త ఆఫర్ల విషయంలో ఆమె సెలక్టీవ్‌గానే వెళ్తున్నట్టు తెలుస్తుంది. 

read more: జనసేన పార్టీలో చేరడంపై మంచు మనోజ్‌ ఫస్ట్ రియాక్షన్‌, తండ్రీకొడుకులు చేసిన పనికి ఈ నిర్ణయం?
 

Latest Videos

click me!