చైతును ఫస్ట్ టైం శోభిత కలిసింది అక్కడే, ఆమె కోసం తరచుగా ముంబైకి అక్కినేని హీరో, ఎట్టకేలకు లవ్ మేటర్ వెలుగులోకి

First Published | Dec 17, 2024, 12:33 PM IST

నాగ చైతన్య-శోభిత వివాహ బంధంలో అడుపెట్టారు. రెండేళ్లకు పైగా రహస్య ప్రేమాయణం జరిపిన ఈ జంట ఫైనల్లీ ఓపెన్ అయ్యారు. వివాహం అనంతరం తమ ప్రేమ కథ బయటపెట్టారు.

Naga Chaitanya-Sobhita Dhulipala

2021లో సమంతతో నాగ చైతన్య విడిపోయాడు. అక్టోబర్ నెలలో పరస్పరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. అప్పటికే మనస్పర్థలు తలెత్తాయనే వార్తల నేపథ్యంలో ఈ న్యూస్ జనాలను పెద్దగా షాక్ కి గురి చేయలేదు. 

Naga Chaitanya-Sobhita Dhulipala

డివోర్స్ తీసుకున్న నాగ చైతన్య మరో హీరోయిన్ తో ఎఫైర్ స్టార్ట్ చేశాడంటూ కథనాలు వెలువడ్డాయి. శోభిత ధూళిపాళ్లను తరచుగా కలుస్తున్న నాగ చైతన్య ఆమెను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి తీసుకెళ్తున్నాడని మీడియా కోడై కూసింది. ఈ పుకార్లను నాగ చైతన్య టీమ్ ఖండించింది. ఈ ఊహాగానాల నడుమ శోభిత, నాగ చైతన్య కలిసి ఉన్న ఫోటోలు లీక్ కావడం సంచలనమైంది. 

Tap to resize

Naga Chaitanya-Sobhita Dhulipala

విదేశాల్లో విహరిస్తున్న నాగ చైతన్య, శోభిత కెమెరా కంటికి చిక్కారు. ఇక వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ సారూప్యతను కలిగి ఉండేవి. నాగ చైతన్య, శోభిత ఖండిస్తున్నప్పటికీ సంథింగ్ సంథింగ్ అని జనాలు ఫిక్స్ అయ్యారు. ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ జరుపుకున్న నాగ చైతన్య, శోభిత.. డిసెంబర్ 4న వివాహ బంధంలో అడుగుపెట్టారు. 

వివాహం అనంతరం శోభిత ధూళిపాళ్ల తమ ప్రేమ కహానీ బయటపెట్టింది. 2022 నుండి నేను నాగ చైతన్యను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను. మా ఇద్దరికీ ఫుడ్ అంటే ఇష్టం. ఎక్కువగా దాని గురించే డిస్కషన్ నడిచేది. నాగ చైతన్య నా గ్లామరస్ ఫోటోలపై స్పందించేవాడు కాదు. కానీ స్ఫూర్తి దాయకమైన పోస్ట్స్ పెడితే మాత్రం లైక్ కొట్టడం చేసేవాడు. నన్ను ఎక్కువగా తెలుగులో మాట్లాడమని కోరేవాడని, శోభిత అన్నారు. 

మేము మొదటిసారి ముంబైలోని ఒక కేఫ్ లో కలిశాము. ఆ రోజు నాగ చైతన్య బ్లూ సూట్ ధరించి ఉన్నాడు. నేను రెడ్ డ్రెస్ లో ఉన్నాను. తర్వాత కర్ణాటకలో ఒక పార్క్ లో కలిశాము. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాము. నేను ముంబైలో ఆయన హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు నన్ను కలిసేందుకు నాగ చైతన్య ముంబై వచ్చేవాడిని, ఆమె వెల్లడించారు. 
 

అక్కినేని ఫ్యామిలీ న్యూ ఇయర్ వేడుకలకు నాకు ఆహ్వానం లభించింది. నేను పాల్గొన్నాను. మా కుటుంబ సభ్యులను నాగ చైతన్య కలిశారు. గోవాలో పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ఆ విధంగా మా పరిచయం పెళ్ళికి దారి తీసింది. ఒకరినొకరం అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, శోభిత అన్నారు. 

కనీసం ఒక్క సినిమా కలిసి చేయలేదు, నాగ చైతన్య, శోభితల మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే సందేహాలు.. లేటెస్ట్ కామెంట్స్ తో క్లారిటీ వచ్చింది. తెలుగులో మాట్లాడేవారంటే నాకు చాలా ఇష్టం. అలా మాట్లాడేవాళ్ళను చూస్తూ ఉండిపోతాను. శోభితను నేను తెలుగు మాట్లాడమని అడిగేవాడిని, ఆమె తెలుగు మాట్లాడుతుంటే చాలా క్యూట్ గా ఉండేది. నాకు ఆమె దగ్గర కావడానికి ఇది కూడా ఒక కారణం.. అని నాగ చైతన్య అన్నారు. నిరాడంబరంగా అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య-శోభితల వివాహం జరిగింది.. 

Latest Videos

click me!