నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం త్వరలో నెరవేరబోతోంది. టాలీవుడ్‌లో నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లేట్ అయ్యింది అనుకుంటే.. సినిమా ఇంకాస్త లేట్ అవుతోంది.
ఈమధ్యే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాని ఎందుకో షూటింగ్ మాత్రం స్లో అయిపోయింది. దానికి ఎన్నో కారణాలు బయట వినిపిస్తున్నాయి. కాని అసలు విషయం ఏంటో మాత్రం తెలియడం లేదు. మోక్షజ్ఞ హెల్తె కూడా బాగోలేదంటు ప్రచారం జరిగింది.